qualified
-
ఫైనల్లో కిన్వెన్ జెంగ్
రియాద్: మహిళల టెన్నిస్ సంఘం ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో చైనా స్టార్ కిన్వెన్ జెంగ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ కిన్వెన్ జెంగ్ 6–3, 7–5తో క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది.తాజా విజయంతో డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోరీ్నలో 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన తొలి చైనా క్రీడాకారిణిగా జెంగ్ గుర్తింపు పొందింది. 2013లో నా లీ ఈ టోరీ్నలో ఫైనల్‌కు చేరుకొని సెరెనా విలియమ్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.క్రెజికోవాతో గంటా 40 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో కిన్వెన్ తొమ్మిది ఏస్‌లు సంధించింది. క్రెజికోవా సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సబలెంకా (బెలారస్), కోకో గాఫ్ (అమెరికా) మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో జెంగ్ తలపడుతుంది. -
ప్యారిస్ ఒలింపిక్స్: 117 మంది.. ఓల్డెస్ట్, యంగెస్ట్ ఎవరంటే? (ఫోటోలు)
-
భారత ఫుట్‌బాల్ జట్టు కొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి
ఆసియా కప్ 2023కి భారత ఫుట్‌బాల్ జట్టు క్వాలిఫై అయింది. మంగళవారం పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాలస్తీనా జట్టు 4-0 తేడాతో విజయం సాధించడంతో భారత్‌కు మార్గం సుగమమైంది. హాంకాంగ్‌తో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ అర్హత సాధించినట్లయింది. గ్రూప్ -డిలో భారత జట్టు 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. టాప్‌లో ఉన్న హంగ్‌కాంగ్‌కి, భారత జట్టుకి మధ్య ఒక పాయింట్ మాత్రమే తేడా. ఒకవేళ హాంకాంగ్‌తో మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికి ఆసియన్ కప్‌కు అర్హత సాధించనుంది. 1956లో ఆసియా కప్ ఆరంభం కాగా.. భారత జట్టు ఇప్పటిదాకా ఐదు సార్లు మాత్రమే అర్హత సాధించగలిగింది. 1964లో మొదటిసారి ఆసియా ఫుట్‌బాల్ కప్ ఆడిన భారత జట్టు.. ఆ తర్వాత 20 ఏళ్లకు అంటే 1984లో ఆసియాకప్‌లో ఆడింది. ఆ తర్వాత 37 ఏళ్ల పాటు ఆసియాకప్‌కు అర్హత సాధించని భారత్.. 2011లో మూడోసారి ఆసియాకప్ ఆడింది. ఇక 2019లో నాలుగోసారి అర్హత సాధించిన భారత్ ఫుట్‌బాల్ జట్టు 2023 ఆసియాకప్ సీజన్లో ఐదోసారి ఆడనుంది. 1964లో ఆసియా కప్ ఫైనల్ మినహా మరెన్నడూ భారత్ ఫుట్‌బాల్ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయచలేదు. 🥳 HERE WE COME 🥳 As Palestine 🇵🇸 defeat Philippines 🇵🇭 in Group 🅱️, the #BlueTigers 🐯 🇮🇳 have now secured back-to-back qualifications for the @afcasiancup 🤩#ACQ2023 🏆 #BackTheBlue 💙 #IndianFootball ⚽ pic.twitter.com/3aNjymWLSm — Indian Football Team (@IndianFootball) June 14, 2022 చదవండి: రూట్ సెంచరీ.. ఎవరు ఊహించని సర్ప్రైజ్! విషాదం.. క్రికెట్ ఆడుతూ కన్నుమూత -
ఒకే ఒక్కడు త్రివర్ణంతో...
బీజింగ్: కరోనా పుట్టిన దేశం రెండేళ్ల తర్వాత కరోనా ఆంక్షల మధ్య ఒలింపిక్ క్రీడలకు వేదికైంది. దేశంలో పలు చోట్ల ఇంకా లాక్డౌన్లు కొనసాగుతుండగానే మరోవైపు చైనా రాజధాని నగరంలో వింటర్ ఒలింపిక్స్–2022 శుక్రవారం ప్రారంభమయ్యాయి. 2008 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నేషనల్ స్టేడియంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీంతో ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ రెండింటినీ నిర్వహించిన తొలి నగరంగా బీజింగ్ ఘనత వహించింది. ఆరంభ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో పాటు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీనికి హాజరు కాగా... భారత్ సహా పలు దేశాలు ‘దౌత్యపర బహిష్కరణ’ను ప్రకటించి కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. 2020లో గాల్వాన్ సరిహద్దుల్లో భారత్‌తో పోరులో గాయపడిన సైనికుడు ఖి ఫాబియోను రిలేలో టార్చ్ బేరర్‌గా పెట్టడంపై తమ అసంతృప్తిని ప్రదర్శిస్తూ భారత్ ‘డిప్లొమాటిక్ బాయ్‌కాట్’ను ప్రకటించింది. మానవ హక్కుల విషయంలో చైనా వ్యవహార శైలిని విమర్శిస్తూ పలు ఇతర దేశాలు కూడా ప్రారంభోత్సవానికి దూరమయ్యాయి. వింటర్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఒకే ఒక్క ఆటగాడు ఆరిఫ్ ఖాన్ అర్హత సాధించాడు. స్కీయింగ్‌లో స్లాలొమ్, జెయింట్ స్లాలొమ్ ఈవెంట్లలో అతను పోటీ పడుతున్నాడు. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన 31 ఏళ్ల ఆరిఫ్ ప్రారంభోత్సవ కార్య క్రమంలో భారత జాతీయ జెండాతో ముందుండగా ... భారత సహాయక సిబ్బందిలోని మరో ముగ్గురు కూడా ఆరిఫ్ వెంట నడిచారు. ఆరిఫ్ ఈవెంట్లు ఈనెల 13, 16వ తేదీల్లో ఉన్నాయి. -
టోక్యో ఒలింపిక్ప్‌కు సానియా మీర్జా అర్హత
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నాలుగేళ్ల తర్వాత టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో మళ్లీ చోటు సంపాదించింది. బుధవారం జరిగిన మిషన్ ఒలింపిక్ సెల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల సానియా ప్రత్యేక ర్యాంకింగ్ నిబంధన ఆధారంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్లో సాయిదేదీప్య సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాయిదేదీప్య సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య 6–2, 6–4తో అవిష్క గుప్తా (జార్ఖండ్)పై గెలిచింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య–అవిష్క జంట 1–6, 6–4, 6–10తో స్నిగ్ధ (కర్ణాటక)–వేద (తెలంగాణ) జోడీ చేతిలో ఓడిపోయింది. -
టోక్యో ఒలింపిక్స్‌కు శివ్‌పాల్ సింగ్ అర్హత
పాచెఫ్‌స్ట్రూమ్: భారత జావెలియన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఏసీఎన్‌డబ్ల్యూ అథ్లెటిక్స్ మీట్లో శివ్‌పాల్ సింగ్ ఈటెను 85.47 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 85 మీటర్లను కూడా శివ్‌పాల్ సింగ్ అధిగమించాడు. భారత్ తరఫున టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెండో జావెలియన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్. ఇప్పటికే నీరజ్ చోప్రా ‘టోక్యో’ బెర్త్ సాధించాడు. -
భారత బాక్సర్ల ‘తీన్మార్’
అమ్మాన్ (జోర్డాన్): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ... భారత అగ్రశ్రేణి బాక్సర్లు అమిత్ పంఘాల్ (52 కేజీలు), మేరీకోమ్ (51 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో ఈ ముగ్గురూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అమిత్ పంఘాల్ 4–1తో కార్లో పాలమ్ (ఫిలిప్పీన్స్)ను ఓడించగా... మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, 37 ఏళ్ల మణిపూర్ మెరిక మేరీకోమ్ 5–0తో ఇరిష్ మాగ్నో (ఫిలిప్పీన్స్)పై... పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రన్‌జిత్ 5–0తో రెండో సీడ్ నమున్ మోన్‌ఖోర్ (మంగోలియా)పై ఘనవిజయం సాధించారు. సిమ్రన్‌జిత్ తొలిసారి ఒలింపిక్ బెర్త్ దక్కించుకోగా... మేరీకోమ్ రెండోసారి ఒలింపిక్స్ బరిలో నిలువనుంది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్ బెర్త్ దక్కించుకోవడంతో ఇదే వెయిట్ కేటగిరీలో ఉన్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఒలింపిక్ ఆశలు ఆవిరయ్యాయి. ఒకవేళ మేరీకోమ్ ఓడిపోయుంటే మే నెలలో పారిస్‌లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ రూపంలో నిఖత్‌కు అవకాశం మిగిలి ఉండేది. సోమవారమే జరిగిన మరో రెండు క్వార్టర్ ఫైనల్ బౌట్స్‌లో భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. పురుషుల విభాగం 63 కేజీల కేటగిరీలో మనీశ్ కౌశిక్ 2–3తో చిన్‌జోరింగ్ బాటర్సుక్ (మంగోలియా) చేతిలో... మహిళల విభాగం 57 కేజీల కేటగిరీలో సాక్షి 0–5తో ఇమ్ ఏజి (కొరియా) చేతిలో ఓడిపోయారు. ఓవరాల్‌గా ఈ టోర్నీ ద్వారా భారత్ నుంచి ఏకంగా ఎనిమిది మంది బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. -
భారత్ ‘పంచ్’ పవర్
అమ్మాన్ (జోర్డాన్): క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమిస్తూ భారత బాక్సర్లు వికాస్ కృషన్ (69 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సతీశ్ కుమార్ యాదవ్ (ప్లస్ 91 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఇక్కడ జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో పురుషుల విభాగంలో వికాస్, ఆశిష్, సతీశ్... మహిళల విభాగంలో పూజా రాణి, లవ్లీనా సెమీఫైనల్ చేరుకొని ‘టోక్యో’ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో వికాస్ 3–2తో సెవోన్‌రెట్స్ ఒకజవా (జపాన్)ను ఓడించగా... ఆశిష్ 5–0తో ముస్కితా (ఇండోనేసియా)పై... సతీశ్ 5–0తో దైవీ ఒట్కోన్‌బాయెర్ (మంగోలియా)పై గెలిచారు. పూజా రాణి 5–0తో పోర్నిపా చుటీ (థాయ్‌లాండ్)పై, లవ్లీనా 5–0తో మెలియెవా (ఉజ్బెకిస్తాన్)పై నెగ్గారు. పురుషుల 81 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో సచిన్ కుమార్ చైనా బాక్సర్ డాక్సియాంగ్ చెన్ చేతిలో ఓడిపోయాడు. విజేందర్ తర్వాత భారత్ తరఫున మూడోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో బాక్సర్‌గా వికాస్ కృషన్ గుర్తింపు పొందగా... ఆశిష్, సతీశ్, పూజా రాణి, లవ్లీనా తొలిసారి ఒలింపిక్స్ బరిలో నిలువనున్నారు. -
భారత మహిళల టెన్నిస్ జట్టు కొత్త చరిత్ర
దుబాయ్: టెన్నిస్ అభిమానులకు భారత మహిళల జట్టు తీపి కబురు అందించింది. ఫెడ్ కప్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో తొలిసారి భారత జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. శనివారం ముగిసిన ఆసియా ఓసియానియా గ్రూప్–1 టోర్నీలో భారత జట్టు రెండో స్థానంలో నిలిచి ఈ ఘనత సాధించింది. చైనా టాప్ ర్యాంక్‌లో నిలిచి భారత్‌తో కలిసి ప్లే ఆఫ్ దశకు బెర్త్ దక్కించుకుంది. శనివారం ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా 3–6, 6–0, 3–6తో ప్రిస్కా చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 6–3, 6–3తో అల్దీలా సుత్‌జియాదిపై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో సానియా మీర్జా–అంకిత రైనా ద్వయం 7–6 (7/4), 6–0తో సుత్జియాది–నుగ్రోహో జంటను ఓడించి భారత్ విజయాన్ని ఖాయం చేసింది. ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడిన ఈ టోర్నీలో సానియా, రుతుజా, అంకిత, రియా భాటియా, సౌజన్య భవిశెట్టిలతో కూడిన భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఏప్రిల్‌లో జరిగే ప్లే ఆఫ్‌లో లాత్వియా లేదా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ ఆడుతుంది. -
షూటింగ్లో మరో ‘టోక్యో’ బెర్త్
దోహా (ఖతర్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల చింకీ యాదవ్ ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటివరకు 11 మంది భారత షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. శుక్రవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో చింకీ యాదవ్ 588 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. ఫైనల్‌కు చేరిన ఎనిమిది మంది షూటర్లలో నలుగురు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ ఈవెంట్లో నాలుగు బెర్త్‌లు మిగిలి ఉండటంతో... ఫైనల్లో చింకీ యాదవ్ 116 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచినప్పటికీ తుది ఫలితంతో సంబంధం లేకుండా ఆమెతోపాటు మరో ముగ్గురు షూటర్లకు (థాయ్‌లాండ్–2, మంగోలియా–1) ‘టోక్యో’ బెర్త్ ఖాయమైంది. మరోవైపు ఇదే టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో తేజస్విని సావంత్, అంజుమ్ మౌద్గిల్, కాజల్ సైని (1864.8 పాయింట్లు) బృందం స్వర్ణం నెగ్గగా... పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ టీమ్ విభాగంలో సంజీవ్ రాజ్‌పుత్, శుభాంకర్, తరుణ్ యాదవ్ (1865.1 పాయింట్లు) బృందం రజతం గెల్చుకుంది. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఉదయ్‌వీర్ సిద్ధూ (577 పాయింట్లు) రజతం సాధించగా... ఉదయ్‌వీర్, విజయ్‌వీర్, గుర్ప్రీత్ సింగ్ బృందం 1710 పాయింట్లతో స్వర్ణం సొంతం చేసుకుంది. -
ఆసియా జూనియర్ స్క్వాష్ ఫైనల్లో భారత్
హాంకాంగ్: భారత కుర్రాళ్లు తమ విజయపరంపరను కొనసాగిస్తూ ఆసియా జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2–0తో ఆతిథ్య హాంకాంగ్ జట్టుపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో రంజిత్ సింగ్ 11–4, 5–11, 11–8, 11–6తో చాన్ చి హోపై నెగ్గగా... రెండో మ్యాచ్‌లో వెలవన్ సెంథిల్ కుమార్ 13–11, 11–13, 11–5, 8–11, 11–5తో లాయ్ చెయుక్ నామ్‌ను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. రెండో సెమీఫైనల్లో మలేసియా 2–1తో పాకిస్తాన్‌ను ఓడించి ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. బాలికల విభాగంలో 5 నుంచి 9 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 1–2తో కొరియా చేతిలో ఓడింది. -
1998 డీఎస్సీ జాబితా సిద్ధం చేయడంలో జాప్యం
- చివరి తేదీ కావడంతో డీఈఓ ఆఫీస్‌కు చేరుకున్న అభ్యర్థులు కర్నూలు సిటీ: 1998 డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన వారి వివరాలను ఈ నెల 19వతేదీలోగా అందించాలని ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేసినా డీఈఓ కార్యాలయం సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరితేదీ కావడంతో సోమవారం సుమారు వంద మంది వరకు కార్యాలయానికి చేరుకుని విషయంపై నిలదీశారు. జాబితా తయారు చేసి పంపించేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లబోమంటూ డీఈఓ కార్యాలయ ఆవరణలోనే బైఠాయించారు. సాయంత్రం వరకు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే రాత్రి వరకు కూడా జాబితా తయారు కాకపోవడం గమనర్హం. విషయంపై డీఈఓ కె.రవీంద్రనాథ్‌రెడ్డిని వివరణ కోరగా రెండు, మూడు రోజుల్లో జాబితాను సిద్ధం చేసి పంపుతామని తెలిపారు. -
రేపు డీఎస్సీ–98 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమావేశం
ఏలూరు సిటీ : డీఎస్సీ–98 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక వన్‌టౌన్ హాయ్ హోటల్ రోడ్డులోని గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయంలో నిర్వహించనున్నట్టు సంఘం నాయకులు సాయిరామ్ ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల విషయాన్ని అభ్యర్థులకు తెలియజేసి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్లతో విధిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు. వివరాలకు 97047 25013, 89851 03482 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
రేపు డీఎస్సీ–98 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమావేశం
ఏలూరు సిటీ : డీఎస్సీ–98 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక వన్‌టౌన్ హాయ్ హోటల్ రోడ్డులోని గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయంలో నిర్వహించనున్నట్టు సంఘం నాయకులు సాయిరామ్ ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల విషయాన్ని అభ్యర్థులకు తెలియజేసి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్లతో విధిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు. వివరాలకు 97047 25013, 89851 03482 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సాదా బైనామా అర్హులను పకడ్బందీగా గుర్తించాలి
సాదా బైనామా అర్హులను పకడ్బందీగా గుర్తించాలి Identify qualified armored plain bainama సాదా బైనామా, అర్హులను, పకడ్బందీగా గుర్తించాలి ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు భద్రాచలం :ప్రభుత్వం సాదాబైనామా ద్వారా రైతుల భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హులను పకడ్బందీగా గుర్తించాలని ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు.శనివారం సబ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన భద్రాచలం, పాల్వంచ డివిజనల్‌లోనితహసీల్దార్,వీఆర్వోల అవగాహన సమావేశంలో పీఓ మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా భూమి హక్కు పత్రాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నా సన్న, చిన్న కారు రైతులకు సాదాబైనామాలు ఇవ్వడం కోసం చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఐదెకరాలలోపు భూమి ఉన్న పేద రైతులకు స్టాంపు ఫీజు లేకుండా ఉచితంగా సాదాబైనామాలు చేయనున్నట్లు తెలిపారు. 2014 జూన్ 2వ తేదీకి ముందు గిరిజనులే ,గిరిజనులకు భూములు అమ్మిన, కొన్న చట్టం ప్రకారంగా పరిశీలించాలన్నారు. రికార్డులను నిశితంగా పరిశీలించాలి.. ఏజెన్సీలో పోడుభూములపై ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో నిశితంగా రికార్డులు పరిశీలించి పూర్తి స్థాయిలో గిరిజన రైతులను గుర్తించాలన్నారు. క్షేత్ర స్థాయిలో వీఆర్వోలు విచారణ చేసేటప్పుడు తహసీల్దార్లు కూడా వెళ్లి దరఖాస్తుదారులు సాగులో ఉన్నారా లేదా అనేది మొదటిగా పరిశీలించాలన్నారు. వారంలోపే విచారణ పూర్తి చేయాలి.. ఫారం 11,12ల ద్వారా నోటీసులు జారీ చేసేటప్పుడు సంతకం చేసి తప్పనిసరిగా తేదీ వేయాలని, వారం రోజులలో విచారణ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుదారుడు స్థానికంగా లేనప్పుడు సంబంధించిన స్థలం వద్దనే నోటీస్ పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్ధాయిలో విచారణ చేసిన వివరాలను కంప్యూటర్లో ఆన్లైన్ చేయాలని వివరించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాజ్, రిటైర్డ్ డీఆర్ఓ రాజారావు, ప్రోగ్రామ్ మేనేజర్ ప్రభాకర్‌రావు, డి. రమేష్, భద్రాచలం, పాల్వంచ డివిజన్ల డీఏఓలు, రామకృష్ణ, స్వర్ణ, తహసీల్దార్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. -
వరల్డ్ గ్రూప్‌కు భారత జూనియర్లు
న్యూఢిల్లీ: భారత జూనియర్ ఫెడ్ కప్ జట్టు ప్రపంచ గ్రూప్‌కు అర్హత సాధించింది. ఆసియా/ఓషియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో జూనియర్ టెన్నిస్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1తో నెగ్గింది. సింగిల్స్‌లో మహక్ జైన్, సామ సాత్విక విజయాలు సాధించారు. డబుల్స్‌లో శివాని, సాత్విక జోడి ఓడింది. ఈ టోర్నీలో జపాన్ చేతిలో ఓడిన భారత్.. లంక, ఉజ్బెకిస్తాన్, కొరియా, ఆసీస్‌పై విజయాలు అందుకుంది.