టెన్నిస్ క్రీడాకారులకు అభినందన
గుంటూరు స్పోర్ట్స్: చెనైలోని సవిత్రా యూనివర్సిటీలో ఈనెల 13 నుంచి జరుగనున్న సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల టెన్నిస్ పోటీలకు ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు అల్లంశెట్టి క్రిష్ణ ప్రసాద్, గిరిష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్టేడియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వారిని మిర్చి యార్డు చైర్మన్ అభినందించారు. అనంతరం మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల టెన్నిస్ పోటీలలో రాణించి జిల్లా ఖ్యాతిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ వజీర్, రాష్ట్ర హస్తకళల సంస్థ డైరెక్టర్ వట్టికూటి హర్షవర్థన్,టెన్నిస్ కోచ్ జి.వి.ఎస్ ప్రసాద్, స్టేడియం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.