ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌లో తెలుగు టాలన్స్ ఆట సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జైపూర్‌లో జరిగిన సెమీస్‌లో తెలుగు టాలన్స్‌పై గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ జట్టు విజయం సాధించింది. నిర్ణీత 60 నిమిషాల సమయంలో ఇరు జట్లు 35–35 గోల్స్‌తో సమంగా నిలవగా, ఆపై 10 నిమిషాల అదనపు సమయం తర్వాత స్కోరు 40–40తో మళ్లీ సమమైంది.
టాలన్స్ తరఫున కైలాశ్ పటేల్ 15 గోల్స్ సాధించగా, యూపీ తరఫున భూషణ్ షిండే 15 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి అర్ధభాగంలో 16–12తో టాలన్స్ ఆధిక్యంలో ఉన్నా... రెండో అర్ధభాగంలో జట్టు పట్టు కోల్పోయింది. అనంతరం ‘షూటౌట్’లో యూపీ 4–3 తేడాతో తెలుగు టాలన్స్‌ను ఓడించింది. మరో సెమీస్‌లో మహారాష్ట్ర ఐరన్‌మెన్ 38–28తో రాజస్తాన్ పేట్రియాట్స్‌పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment