
హ్యాండ్‌బాల్‌కు ఆదరణ పెంచే క్రమంలో మరో ముందడుగు. జైపూర్ వేదికగా ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జూన్ 8 నుంచి జూన్ 25 వరకు రాజస్తాన్‌లోని జైపూర్‌లో గల సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈ లీగ్ నిర్వహించనున్నారు.
ఇందులో రాజస్తాన్ పేట్రియాట్స్, గర్విత్ గుజరాత్, మహారాష్ట్ర ఐరన్‌మెన్, గోల్డెన్ ఈగల్స్ ఉత్తర్‌ప్రదేశ్, తెలుగు టాలోన్స్, ఢిల్లీ పంజెర్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ మ్యాచ్‌లను వయాకామ్ 18, జియో సినిమా, స్పోర్ట్స్ 18 ఖేల్‌లో వీక్షించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment