handball competitions
-
జైపూర్‌లో ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ ఆరంభ సీజన్
హ్యాండ్‌బాల్‌కు ఆదరణ పెంచే క్రమంలో మరో ముందడుగు. జైపూర్ వేదికగా ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జూన్ 8 నుంచి జూన్ 25 వరకు రాజస్తాన్‌లోని జైపూర్‌లో గల సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈ లీగ్ నిర్వహించనున్నారు. ఇందులో రాజస్తాన్ పేట్రియాట్స్, గర్విత్ గుజరాత్, మహారాష్ట్ర ఐరన్‌మెన్, గోల్డెన్ ఈగల్స్ ఉత్తర్‌ప్రదేశ్, తెలుగు టాలోన్స్, ఢిల్లీ పంజెర్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ మ్యాచ్‌లను వయాకామ్ 18, జియో సినిమా, స్పోర్ట్స్ 18 ఖేల్లో వీక్షించవచ్చు. -
హ్యాండ్‌బాల్ బాలుర విజేత వరంగల్
హన్మకొండ చౌరస్తా : హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 పాఠశాలల హ్యాండ్‌బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. బాలుర విభాగంలో వరంగల్ జట్టు విజేతగా నిలవగా... బాలికల విభాగంలో మొదటి స్థానాన్ని నల్లగొండ జట్టు కైవసం చేసుకుంది. క్రీడల ముగింపు కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. హోరాహోరిగా సాగిన ఫైనల్లో బాలుర విభాగంలో వరంగల్ జట్టు మొదటి స్థానంలో, హైద రాబాద్ జట్టు రెండో స్థానంలో నిలిచారుు. అలాగే బాలికల విభాగంలో నల్లగొండ మొదటి స్థానంలో, ఖమ్మం జట్టు రెండోస్థానంలో నిలిచారుు. విజేతలుగా నిలిచిన జట్లు డిసెంబర్ మొదటి వారంలో నాగ్‌పూర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గుమ్మళ్ల సురేందర్ తెలిపారు. మూడు రోజులపాటు సాగిన పోటీల్లో 300 మంది పీఈటీలు, 26 మంది టెక్నికల్, 50 మంది అధికారులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీఓ శివకుమార్, పవన్, శ్రీను, సారయ్య పాల్గొన్నారు. -
చిరుతల్లా.. చెలరేగారు!
డోన్ టౌన్, న్యూస్‌లైన్: గెలుపే లక్ష్యంగా మైదానంలో అడుగుపెట్టిన బాలికలు చిరుతల్లా చెలరేగారు. ప్రత్యర్థి జట్టుపై అధిపత్యం సాధించేందుకు క్షణక్షణం పోరాడారు. పట్టణంలోని ఓనైరో స్కూల్లో ఆ పాఠశాలలో జరుగుతున్న 36వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీలు రెండో రోజు గురువారం హోరాహోరీగా కొనసాగాయి. పోటీలను తిలకించేందుకు వచ్చిన క్రీడాభిమానులు బాలికల ప్రతిభను చూసి కేరింతలతో ప్రోత్సహించారు. ప్రతి మ్యాచ్ కోలాహలం మధ్య రసవత్తరంగా సాగింది. ఉదయం ప్రారంభమైన క్వాటర్ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తూర్పు గోదావరి జట్టుపై 20-12 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో కర్నూలు జట్టు కడప జట్టుపై 12-06 గోల్స్‌తో గెలుపొందింది. వరంగల్ జట్టు ప్రకాశం జిల్లా జట్టుపై 11-06 గోల్స్‌తో విజయం సాధించింది. శ్రీకాకుళం జట్టు అదిలాబాద్ జట్టుపై 09-04 తేడాతో గెలుపొందింది. సెమీఫైనల్స్‌కు చేరుకున్న కర్నూలు, శ్రీకాకుళం, హైదరాబాద్ వరంగల్ జట్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. సాయంత్రం జరిగిన తొలి సెమీఫైనల్ కర్నూలు జట్టు శ్రీకాకుళం జట్టు పై 08-04 గోల్స్ ఆధిక్యంతో విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు వరంగల్ జట్టుపై 09-03 గోల్స్‌తో విజయం సాధించి. శుక్రవారం కర్నూలు, హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అలాగే మూడో స్థానం కోసం శ్రీకాకుళం, వరంగల్ జిల్లా జట్లు తలపడనున్నాయి. పోటీల వివరాలను హ్యాండ్ బాల్ అసోషియేషన్ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు ప్రకటించా రు. కర్నూలు క్రీడాకారులను హ్యాండ్ బ్యాల్ అసోషియేషన్ జాతీయ కార్యదర్శి కొండలరావు, ఓనైరో పాఠశాల కరెస్పాండెంట్ కోట్రికే ఫణిరాజ్, తదితరులు అభినందించారు.