హన్మకొండ చౌరస్తా : హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 పాఠశాలల హ్యాండ్‌బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. బాలుర విభాగంలో వరంగల్ జట్టు విజేతగా నిలవగా... బాలికల విభాగంలో మొదటి స్థానాన్ని నల్లగొండ జట్టు కైవసం చేసుకుంది. క్రీడల ముగింపు కార్యక్రమానికి జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.
హోరాహోరిగా సాగిన ఫైనల్‌లో బాలుర విభాగంలో వరంగల్ జట్టు మొదటి స్థానంలో, హైద రాబాద్ జట్టు రెండో స్థానంలో నిలిచారుు. అలాగే బాలికల విభాగంలో నల్లగొండ మొదటి స్థానంలో, ఖమ్మం జట్టు రెండోస్థానంలో నిలిచారుు. విజేతలుగా నిలిచిన జట్లు డిసెంబర్ మొదటి వారంలో నాగ్‌పూర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గుమ్మళ్ల సురేందర్ తెలిపారు. మూడు రోజులపాటు సాగిన పోటీల్లో 300 మంది పీఈటీలు, 26 మంది టెక్నికల్, 50 మంది అధికారులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ శివకుమార్, పవన్, శ్రీను, సారయ్య పాల్గొన్నారు.
హ్యాండ్‌బాల్ బాలుర విజేత వరంగల్
Published Tue, Nov 18 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement
Advertisement