డోన్ టౌన్, న్యూస్‌లైన్: గెలుపే లక్ష్యంగా మైదానంలో అడుగుపెట్టిన బాలికలు చిరుతల్లా చెలరేగారు. ప్రత్యర్థి జట్టుపై అధిపత్యం సాధించేందుకు క్షణక్షణం పోరాడారు. పట్టణంలోని ఓనైరో స్కూల్లో ఆ పాఠశాలలో జరుగుతున్న 36వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీలు రెండో రోజు గురువారం హోరాహోరీగా కొనసాగాయి. పోటీలను తిలకించేందుకు వచ్చిన క్రీడాభిమానులు బాలికల ప్రతిభను చూసి కేరింతలతో ప్రోత్సహించారు. ప్రతి మ్యాచ్ కోలాహలం మధ్య రసవత్తరంగా సాగింది. ఉదయం ప్రారంభమైన క్వాటర్ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తూర్పు గోదావరి జట్టుపై 20-12 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో కర్నూలు జట్టు కడప జట్టుపై 12-06 గోల్స్‌తో గెలుపొందింది.
వరంగల్ జట్టు ప్రకాశం జిల్లా జట్టుపై 11-06 గోల్స్‌తో విజయం సాధించింది. శ్రీకాకుళం జట్టు అదిలాబాద్ జట్టుపై 09-04 తేడాతో గెలుపొందింది. సెమీఫైనల్స్‌కు చేరుకున్న కర్నూలు, శ్రీకాకుళం, హైదరాబాద్ వరంగల్ జట్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. సాయంత్రం జరిగిన తొలి సెమీఫైనల్ కర్నూలు జట్టు శ్రీకాకుళం జట్టు పై 08-04 గోల్స్ ఆధిక్యంతో విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు వరంగల్ జట్టుపై 09-03 గోల్స్‌తో విజయం సాధించి. శుక్రవారం కర్నూలు, హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అలాగే మూడో స్థానం కోసం శ్రీకాకుళం, వరంగల్ జిల్లా జట్లు తలపడనున్నాయి. పోటీల వివరాలను హ్యాండ్ బాల్ అసోషియేషన్ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు ప్రకటించా రు. కర్నూలు క్రీడాకారులను హ్యాండ్ బ్యాల్ అసోషియేషన్ జాతీయ కార్యదర్శి కొండలరావు, ఓనైరో పాఠశాల కరెస్పాండెంట్ కోట్రికే ఫణిరాజ్, తదితరులు అభినందించారు.
చిరుతల్లా.. చెలరేగారు!
Published Fri, Jan 24 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement
Advertisement