‘అనంత’కు భారీ ఆధిక్యత | anantapur top in under 19 tourny | Sakshi
Sakshi News home page

‘అనంత’కు భారీ ఆధిక్యత

Published Sun, Jul 9 2017 11:09 PM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

anantapur top in under 19 tourny

అనంతపురం న్యూసిటీ : ఏసీఏ అండర్‌ –19 అంతర్‌ జిల్లాల పోటీల్లో భాగంగా కర్నూలుపై అనంతపురం జట్టు భారీ ఆధిక్యత దిశగా పయనిస్తోంది. ఆదివారం  వైఎస్సార్‌ జిల్లాలో అనంతపురం, కర్నూలు జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగులకే కుప్పకూలింది. అనంతపురం బౌలర్లలో ముదుస్సర్‌ 6/22, సాంబశివ 2/25, సంతోష్‌ 2/15 వికెట్లు తీసుకున్నారు. అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆటముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. జట్టులో యోగానంద 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి(52) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement