ముగిసిన జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ ఎంపికలు
Published Sat, Jul 30 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
కరీంనగర్ స్పోర్ట్స్ : జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ స్టేడియంలో సబ్‌జూనియర్ బాలికలకు నిర్వహించిన జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ముగిశాయి. ఈ ఎంపిక పోటీలకు జిల్లా వ్యాప్తంగా గుల్లకోట, రామడుగు, గోపాల్‌రావుపేట, చింతకుంట, రామడుగు, బెజ్జంకి, ధర్మపురి, గర్రెపల్లి నుంచి దాదాపు 80 మంది క్రీడాకారిణిలు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఆగష్టు 6 నుంచి 8 వరకు హన్మకొండలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. పీఈటీలు జిట్టబోయిన శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జట్టు ఇదే..
జి.రోషిణి, ఎండీ సనా, మౌనిక, బి.స్వర్ణలత, ఎ.రాజేశ్వరీ, చేతన, వి.నాగ, అనూష, రవళి, కల్పన, బి.లావణ్య, నాగజ్యోతి, స్టాండ్‌బైగా కె.రవళి, అంజలి సంఘమిత్ర, అఖిల, రమాదేవి.
Advertisement
Advertisement