జైపూర్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్)లో హైదరాబాద్‌కు చెందిన తెలుగు టాలన్స్ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టాలన్స్ 33–22 పాయింట్ల తేడాతో రాజస్తాన్ పేట్రియాట్స్ జట్టును ఓడించింది. కైలాష్ పటేల్ ఏడు గోల్స్ చేయగా... దవిందర్ భుల్లర్ ఐదు గోల్స్ సాధించి తెలుగు టాలన్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
దవిందర్‌కు ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కించుకున్నాడు. కంకణాల అభిషేక్ రెడ్డి యజమానిగా ఉన్న తెలుగు టాలన్స్ జట్టుకిది ఐదో విజయం కావడం విశేషం. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తెలుగు టాలన్స్ పది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో మహారాష్ట్ర ఐరన్‌మెన్ 33–32తో గర్విత్ గుజరాత్ జట్టును ఓడించి 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
సెమీస్‌లో భారత్ ‘ఎ’
హాంకాంగ్: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత ‘ఎ’ జట్టు సెమీఫైనల్ చేరింది. భారీ వర్షం కారణంగా భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య శనివారం జరగాల్సిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ రద్దయింది. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక భారత్, పాక్ జట్లు నాలుగు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ నుంచి సెమీఫైనల్‌కు చేరాయి. గ్రూప్ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. సోమవారం జరిగే సెమీఫైనల్స్‌లో శ్రీలంకతో భారత్; బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment