![This Sports Legend Is Selling Skateboards Painted With His Own Blood - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/26/Tony%20Hawk.jpg.webp?itok=KzUuahGr)
సాక్షి,న్యూఢిల్లీ: స్పోర్ట్స్ లెజెండ్ ముఖ్యంగా స్కేట్‌బోర్డింగ్ లెజెండ్ టోనీ హాక్ (53) తన ఫ్యాన్స్‌కు ఒక అరుదైన అవకాశాన్నిస్తున్నారు. స్వయంగా తన రక్తంతో కలిపి పెయింట్ చేసిన స్కేటింగ్ బోర్డ్స్‌ను విక్రయిస్తున్నాడు. లిమిటెడ్-ఎడిషన్‌గా 100 స్కేట్‌బోర్డ్‌లను లాంచ్ చేశాడు. వీటి తయారీకోసం టోనీ బ్లడ్‌ను డోనేట్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
దీనిపై టోనీ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. లిక్విడ్ డెత్ మౌంటైన్ వాటర్ తోపాటు, టోనీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన వీడియోను బుధవారం షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 1.7 మిలియన్ వ్యూస్ దాటేసింది. టోనీ హాక్ లిక్విడ్ డెత్‌కు అంబాసిడర్ అయ్యాడంటూ చమత్కరించింది. అంతేకాదు లెజెండరీ అథ్లెట్ రక్తంతో నిండిన స్కేట్ బోర్డ్‌ను సొంతం చేసుకోవడం అంత సులభం కాదు చౌక అంతకన్నా కాదు. వీటి ధర 500 డాలర్లు అంటూ ప్రకటించింది. వీటిని స్టెరిటైజ్ కూడా చేశాం.. త్వరపడండి సాధ్యమైనంత తొందరగా వీటిని సొంతం చేసుకోండి అంటూ ఫ్యాన్స్‌కు పిలుపినిచ్చింది. అయితే దీనిపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
చదవండి: Kabul Airport: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి
కాగా టోకీ స్కేట్‌బోర్డ్ గేమ్స్ ఇప్పటికీ చాలామంది ఆసక్తి చూపిస్తారు. లిక్విడ్ డెత్ వెబ్‌సైట్ ప్రకారం, స్కేట్ బోర్డ్ నుండి వచ్చే లాభాలలో 10శాతంటోనీకి చెందిన ‘ది స్కేట్ బోర్డ్ ప్రాజెక్ట్’కు వెళతాయి. వీటి ద్వారా పబ్లిక్ స్కేట్‌పార్క్‌ల అభివృద్ధి, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు పనిచేస్తున్న 5 గైర్స్ సంస్థలకు నిధులు సమకూర్చుతుంది.
చదవండి: తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!?
Comments
Please login to add a commentAdd a comment