Viral: Australian Parliament House Staff Sex Acts Videos Leaked - Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో రాసలీలలు.. డెస్క్‌లు, టేబుళ్ల చాటుగా

Published Tue, Mar 23 2021 3:15 PM | Last Updated on Tue, Mar 23 2021 5:02 PM

Australia Parliament House Sex Videos Leaked - Sakshi

సిడ్నీ: ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్‌ కాస్త బెడ్రూమ్‌గా మారింది. కామవాంఛ తీర్చుకోవడానికి అడ్డాగా మారింది. పార్లమెంట్‌ సిబ్బంది యథేచ్ఛగా రాసలీలలు కొనసాగిస్తూ పార్లమెంట్‌కు మచ్చ తీసుకువచ్చారు. ఈ ఘటనలు ఆస్ట్రేలియా అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కంగారు దేశంలో కలకలం రేపుతోంది.

పార్లమెంట్‌లో ఆవరణలో సిబ్బంది రాసలీలల ఫొటోలు, వీడియోలు లీకవడంతో తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆ ఫొటోలు, వీడియోలతో ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించడంతో బహిర్గతమైంది. దీంతో వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఒకరిపై వేటు వేయగా.. రక్షణ శాఖ మంత్రి క్షమాపణలు చెప్పారు.

పార్లమెంట్‌లోని ప్రేయర్‌ రూమ్‌ను ఉద్యోగి టామ్‌ బెడ్రూమ్‌గా చేసుకున్నారు. అతడితో పాటు ఎంతో మంది సిబ్బంది ఈ విధంగా చేశారు. తోటి సిబ్బందితో పాటు బయటి నుంచి వేశ్యలను పిలిపించుకుని రాసలీలలు కొనసాగించారని ఆ దేశ ప్రధాన మీడియా బహిర్గతం చేసింది. ఓ మహిళ ఎంపీకి సంబంధించిన క్యాబీన్‌లో ఈ కామ కార్యాలు కొనసాగాయని తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదలయ్యాయి. సోషల్‌ మీడియాలో వాటికి సంబంధించినవి ట్రెండవుతున్నాయి. 

ఈ రాసలీలల కేసులో కేవలం టామ్‌ పేరు మాత్రమే బయటకు వచ్చింది. మిగతా వారి వివరాలు గోప్యంగా ఉంచారు. త్వరలోనే వారిని గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ వీడియోలు 2019 నాటివి. రెండేళ్ల కిందటి వీడియోలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ రాసలీలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పార్లమెంట్‌ ముట్టడికి ప్రయత్నించారు.

ఈ విషయంలో గతంలోనే ఓ మహిళ లైంగిక దాడి జరిగిందని ఆరోపించింది. ఈ విషయమై ఆ దేశ రక్షణ శాఖ మంతత్రి క్షమాపణ కూడా చెప్పారు. ఈ రాసలీలల ఘటనపై ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ స్పందించారు. ఈ వీడియోలు షాక్‌కు గురి చేశాయని చెప్పారు. సభను మళ్లీ ఆర్డర్‌లోకి పెట్టాలని, రాజకీయాలను పక్కనపెట్టి సమస్యను గుర్తించాలని సూచించారు.

చదవండి: ఏం తెలివబ్బా.. మాస్క్‌తో హైటెక్‌ కాపీయింగ్‌
చదవండి: స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అదృశ్యం వెనుక మిస్టరీ ఇదేనా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement