ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు | KTR Birthday Celebrations At Australia Sydney Canberra Melbourne | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

Published Sat, Jul 23 2022 7:07 PM | Last Updated on Sat, Jul 23 2022 7:14 PM

KTR Birthday Celebrations At Australia Sydney Canberra Melbourne - Sakshi

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.  టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అస్ట్రేలియా రాజధాని కెన్బెర్రాలో రవి సాయల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.  

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రవి  సాయల మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో బాగంగా మెల్బోర్న్‌లో కల్వకుంట్ల సాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకలలో టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా కోర్  కమిటి నాయకులు ఝాన్సీ నోముల , గాయత్రి అరిగెల, రాకేష్ లక్కరసు , సిద్దు గొర్ల , రమేష్ కైల రుద్ర కొట్టు , వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement