KTR birth day
-
అనాథ పిల్లలకు అండగా
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది అర్థవంతంగా జరుపుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడాలో ఉన్న స్టేట్ హోమ్‌లోని అనాధ పిల్లలకు అండగా నిలవాలనుకుంటున్నట్లు ప్రకటించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10, 12వ తరగతుల్లో ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు, ప్రొఫెషనల్ కోర్సుల నుంచి మరో 47 మంది పిల్లలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్‌లు అందిస్తానని తెలిపారు. వారి బంగారు భవిష్యత్కై బెస్ట్ ఇన్స్టిట్యూట్ ద్వారా రెండేండ్ల పాటు అత్యుత్తమ కోచింగ్ ఇప్పిస్తానని స్పష్టం చేశారు. కాగా, తన పుట్టినరోజు సందర్భంగా ఎవరికి తోచిన మార్గంలో వారు అనాథ పిల్లలకు సహాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరుతున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. నేడు వెయ్యిమంది రక్తదానం మంత్రి కేటీఆర్ 47వ జన్మదినం సందర్భంగా సోమవారం ఖాజాగూడలోని దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఐటీ పార్క్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐటి టవర్లలో పనిచేసే దాదాపు 1000 మంది టెక్కీలు రక్తదానం ఇవ్వనున్నారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అస్ట్రేలియా రాజధాని కెన్బెర్రాలో రవి సాయల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రవి సాయల మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో బాగంగా మెల్బోర్న్లో కల్వకుంట్ల సాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటి నాయకులు ఝాన్సీ నోముల , గాయత్రి అరిగెల, రాకేష్ లక్కరసు , సిద్దు గొర్ల , రమేష్ కైల రుద్ర కొట్టు , వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకరికొకరూ తోడుగా ఉండాలి: మేయర్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఒకరికొకురు తోడుగా ముందుకు నడవాలని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భయం విడిచి కర్తవ్యం నిర్థేశించుకుని సాగాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజలందరికీ ధైర్యం చెబుతూ ముందుకు తీసుకువెళుతున్న కేటీఆర్ కరోనాపై యుద్ధంతో పాటు నగరాభివృద్ధి పనులు శరవేగంతో ఉరికిస్తున్నారన్నారు. జూలై 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా #GiftASmile కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. మంత్రి స్పూర్తితో అందరూ #GiftASmile కార్యక్రమాన్ని చేపట్టి తోటివారి ముఖాల్లో చిరువ్వులు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజున నిర్వహించే #GiftASmile కార్యక్రమంలో భాగంగా మనందరం ఇబ్బందుల్లో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి ఆసరాగా ఉందామని పిలుపునిచ్చారు. ఆయన పుట్టిన రోజుల మనం పూల బోకేలు, శాలువాలు, పత్రికా ప్రకటనలు హోర్డింగుల మీద డబ్బులు ఖర్చు చేయకుండా దానికి బదులు సాటి మనిషికి సాయపడదామని పేర్కొన్నారు. వస్తు రూపంలో కానీ, ధన రూపంలో కానీ మేరే ఇతర వ్యక్తిగత సామాజిక అవసరాలను తీర్చి #GiftASmile అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కోవిడ్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి చిరునవ్వులను కానుకగా ఇవ్వడమే మన నాయకుడికి నిజమైన జన్మదిన శుభకాంక్షలు అన్నారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పోస్టులలో #GiftASmile హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేయాలని మేయర్ కోరారు. -
హ్యాపీ బర్త్‌డే కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేటీఆర్ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సినీపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, ఆయనతో కలిసి తీయించుకున్న ఫొటోలను ట్యాగ్ చేశా రు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం లో పలువురు రక్తదానం చేశారు. శాసనసభ అవరణలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటి పరిధిలో వెయ్యి మొక్కలు నాటారు. ఇక బహ్రెయిన్‌లో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో గుడైబియా ఆండాల్స్ గార్డెన్‌లోనూ మొక్కలు నాటి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. గిఫ్ట్ ఏ స్మైల్‌కు అపూర్వ స్పందన.. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమాను లు చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి భారీ స్పం దన వచ్చింది. కేటీఆర్ అనుచరులు, అభిమానులు, మిత్రులు, సన్నిహితులు తమ వంతుగా ఏదో ఒక మంచి పని చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానాలు, పుస్తకాలు, సైకిళ్ల వితరణ, హరితహా రం, విద్యార్థులకు ఆర్థిక సాయం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన వంతుగా విద్యార్థులకు ఇంగ్లిష్ డిక్షనరీలు పంచారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ముగ్గురికి ఆర్థిక సహాయం అందజేశారు. తన నియోజకవర్గానికి చెందిన వి.నవ్య అనే పేద విద్యార్థి ఉన్నత చదువుల కోసం, తెలంగాణ ఉద్యమం సందర్భంగా గాయపడిన శివ, రాజులకు రూ.లక్ష చొప్పున సాయం చేశారు. కాగా, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి, గిఫ్ట్ ఏ స్మైల్ కింద సమాజ సేవ చేసిన అందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో హిమాన్షు.. తన తండ్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించారు. రహమత్ నగర్‌లోని కుమార్ స్కూల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవస్థానంలో కేటీఆర్ పేరు మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
కేటీఆర్ ఇన్ రూబిక్స్ క్యూబ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా రూబిక్స్ క్యూబ్లతో ఆయన చిత్రపటాన్ని రూపొందించారు. బుధవారం కేటీఆర్ పుట్టిన రోజు కావడంతో కూకట్‌పల్లికి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పాటిమీది జగన్మోహన్రావు కార్యాలయంలో 2,100 రూబిక్స్ క్యూబ్లతో ఈ చిత్రపటాన్ని (పోర్ట్ట్రెయిట్) రూపొందించారు. ఇలా రూబిక్స్ క్యూబ్లతో చిత్రపటం రూపొందించడం మనదేశంలో తొలిసారని, కేటీఆర్‌కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపాలన్న ఆలోచనతో తన మేనల్లుడు కౌశిక్, అతని మిత్రుడు శరణ్‌గుప్తా అనే 9వ తరగతి విద్యార్థులు రెండు రోజులు శ్రమించి ఈ చిత్రపటాన్ని రూపొందించినట్లు జగన్మోహన్ రావు తెలిపారు. నేడు కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయనున్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విద్యార్థివిభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. కేటీఆర్‌కు వరల్డ్ వాటర్ కాంగ్రెస్ ఆహ్వానం వచ్చే ఏడాది మేలో అమెరికాలోని నెవెడాలో జరగనున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్, వాటర్ కాంగ్రెస్ సదస్సుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ఆహ్వానం అందింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ సంస్థ నిర్వహించే ఈ సదస్సుకు రెండోసారి కేటీఆర్‌కి ఆహ్వానం లభించింది. 2017లో కాలిఫోర్నియా శాక్రమెంటోలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీనోట్ అడ్రస్ ఇచ్చారు. 2017లో కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల గురించి కేటీఆర్ తన ప్రసంగంలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సాగు నీరు, పర్యావరణ సమతుల్యత, నీటి వనరుల అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను గురించి తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభమైన విషయాన్ని తెలుసుకున్నట్టు కేటీఆర్‌కి పంపిన ఆహ్వానంలో నిర్వాహకులు పేర్కొన్నారు. ఈసారి కూడా కీనోట్ స్పీకర్‌గా హాజరై తెలంగాణ సాగునీటి అనుభవాలను వివరించాలని కోరారు. 2020 మే 17 నుంచి 21 వరకు అమెరికాలోని నెవెడాలో ఈ సదస్సు జరుగనుంది. వివిధ దేశాల్లోని సాగునీటి వ్యవస్థలు, స్మార్ట్ వాటర్ కార్యక్రమాల గురించి చర్చించనున్నట్టు పేర్కొన్నారు. -
ఘనంగా కేటీఆర్ జన్మదినం
నారాయణపేట రూరల్: ఐటీ రంగంలో వినూత్న ఒరవడి సష్టించి తెలంగాణ రాష్ట్రానికి మార్గనిర్ధేశనం చేస్తున్న మంత్రి కేటీఆర్‌ను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని టీఆర్ఎస్వీ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీపాద్ పిలుపునిచ్చారు. కేటీఆర్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచారు. పట్టణంలో మోటర్‌బైక్ ర్యాలీ చేపట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్‌నాగరాజు, వైస్ చైర్మన్ చెన్నారెడ్డి, టౌన్ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్‌రెడ్డి, డాక్టర్ నర్సింహారెడ్డి, కృష్ణ కోర్వర్, కన్న జగదీష్, విజయ్‌సాగర్, ప్రతాప్‌రెడ్డి, వెంకట్, సుమిత్, రాజు, శివ, సిద్దు, వినోద్, అశోక్, ఫయాజ్, అనిల్, చరణ్, కష్ణనాయక్, నరేష్ పాల్గొన్నారు. -
జ్వరంతో ప్రగతి భవన్‌లోనే కేటీఆర్!
సాక్షి, హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జ్వరం కారణంగా ప్రగతి భవన్‌కే పరిమితమైన కేటీఆర్‌కు నేతలు, కార్యకర్తలు, అభిమానులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ట్వీట్ల ద్వారానే కేటీఆర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పలుచోట్ల నేతలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన అన్న రియల్ హీరో అంటూ ఎంపీ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంతో పోలిస్తే ఈసారి ఫ్లెక్సీలు కటౌట్లు ఎక్కడా కనిపించలేదు. ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయకూడదని మంత్రి కేటీఆర్ స్వయంగా ఆదేశించడంతో హైదరాబాదులో ఆ హడావిడి కనిపించలేదు. మంత్రులు, పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారం నిర్వహించి బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ సూచించిన నేపథ్యంలో నేతలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు . కొందరు మంత్రులు మాత్రం నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రెండ్రోజులుగా జ్వరంగా ఉందని విషెస్ చెప్పడానికి ఎవరూ రావద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి హరీష్‌రావు చెప్పిన జన్మదిన శుభాకాంక్షలకు.. థాంక్యూ బావా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు ఇతర పార్టీల నేతలు, జాతీయ నేతలు కూడా కేటీఆర్‌కు ట్విటర్లోనే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు సినీ రంగ ప్రముఖులు కూడా ట్వటర్ వేదికగా కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. అన్న కేటీఆర్ గురించి ఎంపీ కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు చెప్తూనే నిజజీవితంలో హీరోలు ఉండరని ఎవరైనా అంటే తాను ఒప్పుకోనని.. తన అన్నను చూపిస్తానని కవిత ట్వీట్ చేశారు. అభిమానులు చేసిన ట్వీట్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. -
కేటీఆర్ బర్త్ డే.. ఆర్భాటాలు బంద్..!
-
కేటీఆర్ బర్త్ డే.. ఆర్భాటాలు బంద్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం 42వ వసంతంలోకి అడుగుపెట్టుబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు ఒక పాటను బహూకరించారు. కేటీఆర్ బర్త్‌డే సాంగ్‌ను ఎమ్మెల్యేశంభీపూర్ రాజు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం విడుదల చేశారు. ‘నీలాల మబ్బుల్లో సూర్యుడు.. నువ్వు తెలంగాణ నేల రాముడు’ అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, తన జన్మదినం సందర్భంగా కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కేటీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తి మేరకు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మేయర్ బొంతు రామ్మోహన్ తీసేయించారు. ఇక కేసీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేటీఆర్ అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. తనకు కేటాయించిన శాఖల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. -
కేటీఆర్‌పై సమంత ప్రశంసల జల్లు!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా సినీనటి సమంత ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. అత్యధికమంది అభిమానించి నాయకుడు కేటీఆర్ అని, ఆయన నిజమైన స్ఫూర్తి అని సమంత కొనియాడారు. భావి ఆశకిరణమైన ఆయన గురించి తెలియడం గౌరవంగా భావిస్తున్నట్టు సమంత పేర్కొన్నారు. సమంత ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. మా చేనేత ప్రచాకకర్తకు ధన్యవాదాలు అంటు బదులిచ్చారు. ఆమె చూపిన శ్రద్ధ, అంకితభావం చేనేతకు కొత్త జీవాన్ని అందించాయని ప్రశంసించారు. వోవెన్2017 కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు పోటెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు అనేకమంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రకుల్‌ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి, దేవీ శ్రీప్రసాద్, అక్కినేని అఖిల్, మంచు విష్ణు, వెన్నెల కిషోర్, సానియా మీర్జా, పీవీ సింధుతోపాటు మంత్రి హరీశ్‌రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రి లోకేశ్ తదితరులు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.