సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఒకరికొకురు తోడుగా ముందుకు నడవాలని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భయం విడిచి కర్తవ్యం నిర్థేశించుకుని సాగాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజలందరికీ ధైర్యం చెబుతూ ముందుకు తీసుకువెళుతున్న కేటీఆర్ కరోనాపై యుద్ధంతో పాటు నగరాభివృద్ధి పనులు శరవేగంతో ఉరికిస్తున్నారన్నారు. జూలై 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా #GiftASmile కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు.
మంత్రి స్పూర్తితో అందరూ #GiftASmile కార్యక్రమాన్ని చేపట్టి తోటివారి ముఖాల్లో చిరువ్వులు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజున నిర్వహించే #GiftASmile కార్యక్రమంలో భాగంగా మనందరం ఇబ్బందుల్లో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి ఆసరాగా ఉందామని పిలుపునిచ్చారు. ఆయన పుట్టిన రోజుల మనం పూల బోకేలు, శాలువాలు, పత్రికా ప్రకటనలు హోర్డింగుల మీద డబ్బులు ఖర్చు చేయకుండా దానికి బదులు సాటి మనిషికి సాయపడదామని పేర్కొన్నారు. వస్తు రూపంలో కానీ, ధన రూపంలో కానీ మేరే ఇతర వ్యక్తిగత సామాజిక అవసరాలను తీర్చి #GiftASmile అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కోవిడ్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి చిరునవ్వులను కానుకగా ఇవ్వడమే మన నాయకుడికి నిజమైన జన్మదిన శుభకాంక్షలు అన్నారు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పోస్టులలో #GiftASmile హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేయాలని మేయర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment