
ఇన్నారెడ్డి నివాసంలో వైఎస్‌ఆర్‌సీపీ-కాన్‌బెర్రా సమావేశం
కాన్‌బెర్రా :
ఆస్ట్రేలియాలో వైఎస్‌ఆర్‌సీపీ-కాన్‌బెర్రా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాన్‌క్రిఫ్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఇన్నా రెడ్డి నివాసంలో వైఎస్‌ఆర్‌సీపీ-కాన్‌బెర్రా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి హాజరయిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలను ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడారు.
ఈ సమావేశంలో ఇన్నారెడ్డితోపాటూ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాజశేఖర్, రాజ్‌కుమార్ బద్దం, జగన్ జంబుల, స్టానిస్ బెనెడిక్ట్, వరుణ్, శౌరీ రెడ్డి, సంపత్, ఈశ్వర్ రెడ్డి, రాకేష్‌లు పాల్గొన్నారు.