జాబ్ లేదు.. కానీ, కొడుక్కి మంత్రి పదవి
Published Tue, Aug 22 2017 3:18 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
కాకినాడ: ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఇంటికో జాబ్ సంగతి ఏమోగానీ తన కొడుక్కి మాత్రం మంత్రి పదవి ఇచ్చుకున్నారని ఆమె తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేకపోయారని ఆమె అన్నారు. ఇక రిజర్వేషన్ల పేరుతో కాపులను దారుణంగా మోసం చేశారని, పైగా ఉద్యమం చేస్తున్న ముద్రగడను ఇంట్లో నిర్భంధించి వేధిస్తున్నారని తెలిపారు. కాకినాడ ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని కాపులకు లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement