గుంటూరు: కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ఇప్పటికే మూడుసార్లు అడ్డుకున్నారని చెప్పారు.
కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేసినపుడు ముద్రగడ కుటుంబ సభ్యులను పోలీసులు దారుణంగా అవమానించారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనం కోసం విశాఖపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల కూడా పోలీసులు అలాగే వ్యవహరించారని తెలిపారు. తుని ఘటన, రాజధాని పొలాల్లో మంటల కేసులు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రెండు ఘటనల్లో టీడీపీ నేతలే ఉన్నారని అంబటి ఆరోపించారు.
కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్ర
Published Tue, Jan 31 2017 4:39 PM | Last Updated on Mon, Jul 30 2018 6:23 PM
Advertisement