టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్పై చెప్పులేయించిన నీచుడు చంద్రబాబు నాయుడని ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి విమర్శించారు.
విజయవాడ: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్పై చెప్పులేయించిన నీచుడు చంద్రబాబు నాయుడని ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.
మంగళవారం విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాళ్లు పట్టుకుని కేసు మాఫీ చేయించుకున్న చంద్రబాబు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు.