ఆస్ట్రేలియాలో ఘనంగా జాతిపిత జయంతి వేడుకలు | Mahatma Gandhi's birth anniversary celebrated in Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఘనంగా జాతిపిత జయంతి వేడుకలు

Published Wed, Oct 2 2013 1:04 PM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM

భారత జాతిపిత మహత్మా గాంధీ 144 జయంతి వేడుకలు బుధవారం ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.

భారత జాతిపిత మహత్మా గాంధీ 144 జయంతి వేడుకలు బుధవారం ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మహత్ముని జన్మదినాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియా రాజధాని కెన్బెర్రలోని భారత రాయబారీ కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ ప్రార్థనలకు రాయబార కార్యాలయ అధికారులతోపాటు సిబ్బంది హాజరయ్యారు. అలాగే న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీలో కూడా జయంతి వేడుకులు జరిగాయి.

 

ఈ సందర్బంగా యూనివర్శిటీ ప్రాంగణంలోని గ్రంధాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్బంగా స్థానికంగా మహత్మునిపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటితోపాటు గాంధీ పీస్ సెంటర్ ఆధర్వంలో న్యూసౌత్ వేల్స్లో 35 గ్రంధాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సెంటర్ డైరెక్టర్ రాణీ డిసౌజా ఈ సందర్బంగా ప్రసంగిస్తూ. ఆస్ట్రేలియాలో గాంధీజీ అహింసా బోధనలు ప్రఖ్యాతి పొందాయని వివరించారు.

 

గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు దేశంలోని ప్రతి ఒక్కరికి చేరాలని  డిసౌజా ఆకాంక్షించారు. ఆ మహానియుని జన్మదినాన్ని పురస్కరించుకోని గాంధీజీ ప్రబోధనలు, సిద్ధాంతాలు, ఆచరణీయాలకు సంబంధించి 10 పుస్తకాలను గ్రంధాలయాలకు అందిస్తున్నట్లు డిసౌజా తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో గాంధీ జయంతి సందర్బంగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement