టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో)
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ‘పింక్ బాల్’ టెస్టులో భారత ఓపెనింగ్ జోడీపై స్పష్టతనిచ్చాడు. యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.
ఇక.. తాను మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతానని చెప్పిన రోహిత్ శర్మ.. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. తనకు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమేనని.. అయినా జట్టు కోసం ఓపెనింగ్ స్థానం త్యాగం చేయక తప్పలేదని పేర్కొన్నాడు.
పితృత్వ సెలవులు
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. తన భార్య రితికా సజ్దే కుమారుడు అహాన్‌కు జన్మనివ్వడంతో పితృత్వ సెలవులు తీసుకున్నాడు. అయితే, మొదటి టెస్టు మధ్యలోనే ముంబై నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు హిట్‌మ్యాన్.
జైస్వాల్‌తో కలిసి రాణించిన రాహుల్
ఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులో రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించగా.. యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం(161) బాదాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్(26, 77) సైతం మెరుగ్గా రాణించాడు.
అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనింగ్ జోడీని మారుస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. రాహుల్‌ను మిడిలార్డర్‌లోకి పంపి రోహిత్ ఓపెనర్‌గా వస్తాడేమోనని అంతా భావించారు. అయితే, తానే మిడిలార్డర్‌లో వస్తానని రోహిత్ శర్మ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
పింక్ బాల్‌తో
కాగా అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టు డే అండ్ నైట్ మ్యాచ్. దీనిని పింక్ బాల్‌తో నిర్వహిస్తారు. ఇక ఇందుకోసం రోహిత్ సేన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో మిడిలార్డర్‌లో వచ్చిన రోహిత్ శర్మ(3) విఫలం కాగా.. ఓపెనర్లు జైస్వాల్ 45, రాహుల్ 27(రిటైర్డ్ హర్ట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment