‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరుగనుంది. పింక్ బాల్‌తో నిర్వహించనున్న ఈ డే అండ్ నైట్ మ్యాచ్ శుక్రవారం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ పిచ్ గురించి ప్రధాన క్యూరేటర్ డామియన్ హగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడి పిచ్ స్పిన్ బౌలింగ్‌కు సహకరించనుందని వెల్లడించాడు పిచ్‌పై 6 మిల్లీ మీటర్ల పచ్చిక ఉంటుందని పేర్కొన్నాడు.
ఆరంభంలో పేస్‌కు సహకరించినా...
అయితే, ఫ్లడ్ లైట్ల వెలుతురులో గులాబీ బంతిని ఎదుర్కోవడం కొంచెం కష్టమే అని... అయితే పిచ్ అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు సహకరిస్తుందని హగ్ వెల్లడించాడు. ‘రికార్డులు పరిశీలిస్తే అడిలైడ్‌లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయడం కష్టమనేది సుస్పష్టం. పిచ్‌పై పచ్చిక ఉండనుంది. ఆరంభంలో పేస్‌కు సహకరించినా... మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపగలరు.
బంతి పాతబడే వరకు కుదురుకుంటే పరుగులు రాబట్టడం పెద్ద కష్టం కాదు. అడిలైడ్‌లో స్పిన్ కీలక పాత్ర పోషించడం పరిపాటి. ఇక్కడ ఆడేటప్పుడు ప్రధాన స్పిన్నర్ తుది జట్టులో ఉండాల్సిందే. మ్యాచ్ ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపితే... రాత్రి పూట స్పిన్నర్లు ప్రమాదకరం’ అని హగ్ తెలిపాడు.
గతంలొ 36 పరుగులకే ఆలౌట్
కాగా పెర్త్‌లో జరిగిన టెస్టులో భారత్ ఆసీస్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టును ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది బుమ్రా సేన. ఇక అడిలైడ్ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. కాగా 2020లో ఇదే వేదికపై భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డును మూటగట్టుకుంది.
చదవండి: ‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’
Comments
Please login to add a commentAdd a comment