Adelaide Test
-
కోహ్లి మరోసారి విఫలం.. కష్టాల్లో టీమిండియా! అద్భుతం జరిగితేనే..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీ కొట్టి మురిపించిన ఈ రన్‌మెషీన్.. అడిలైడ్‌లో మాత్రం తేలిపోయాడు. పింక్ బాల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఏడు పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులకే నిష్క్రమించాడు.అజేయ శతకంతో అలరించిఈ నేపథ్యంలో కోహ్లి నిలకడలేమి ఫామ్‌పై మరోసారి విమర్శలు వస్తున్నాయి. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టు.. పెర్త్ టెస్టులో గెలిచి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకం బాదాడు కోహ్లి.యువ ఆటగాళ్ల కంటే కూడా దారుణంగాటెస్టుల్లో ముప్పైవ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ పరుగుల యంత్రం అడిలైడ్‌లోనూ రాణిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌లో యువ ఆటగాళ్ల కంటే కూడా కోహ్లి ఘోరంగా వైఫల్యం చెందాడు. ఈ క్రమంలో 180 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడుతోంది.కనీసం ఇప్పుడైనా కోహ్లి ఆదుకుంటాడేమోనని భావిస్తే ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. నిజానికి అడిలైడ్‌లో ఆరంభం నుంచి కోహ్లి కాస్త జాగ్రత్తగానే ఆడాడు. చీకట్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్‌ను ఎదుర్కొనే క్రమంలో.. అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతులను కోహ్లి వదిలేశాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్లో ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ వేసిన బంతిని బౌండరీకి తరలించి.. టచ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు.కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగిన కోహ్లిఅయితే, బోలాండ్ చేతికే కోహ్లి చిక్కడం గమనార్హం. పదిహేనవ ఓవర్ మూడో బంతి ఆఫ్ స్టంప్ దిశగా రాగా.. షాట్ ఆడేందుకు ప్రయత్నించి కోహ్లి విఫలమయ్యాడు. బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడటంతో కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తంగా 21 బంతులు ఎదుర్కొని 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి పెవిలియన్ చేరాడు.కష్టాల్లో టీమిండియాఇక శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(24) ఫర్వాలేదనిపించగా.. కేఎల్ రాహుల్(7) విఫలమయ్యాడు. శుబ్‌మన్ గిల్(28) రాణించగా.. కోహ్లి(11), రోహిత్ శర్మ(6) నిరాశపరిచారు. ఆట ముగిసే సరికి రిషభ్ పంత్ 28, నితీశ్ కుమార్ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ కంటే(తొలి ఇన్నింగ్స్) టీమిండియా ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు ఏదైనా అద్భుతం జరిగితేనే టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంటుంది. లేదంటే.. ఘోర పరాభవం తప్పదు. ఇక రెండో రోజు ఆటలో ఆసీస్ పేసర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టువేదిక: అడిలైడ్ ఓవల్ మైదానం, అడిలైడ్- పింక్ బాల్ టెస్టు- డే అండ్ నైట్ మ్యాచ్టాస్: టీమిండియా.. బ్యాటింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 180ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 337రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 128/5 (24).చదవండి: అద్భుత యార్కర్‌తో సెంచరీ వీరుడికి చెక్!.. సిరాజ్ ఉగ్రరూపం చూశారా? -
Ind vs Aus: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు
‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరుగనుంది. పింక్ బాల్‌తో నిర్వహించనున్న ఈ డే అండ్ నైట్ మ్యాచ్ శుక్రవారం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ పిచ్ గురించి ప్రధాన క్యూరేటర్ డామియన్ హగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడి పిచ్ స్పిన్ బౌలింగ్‌కు సహకరించనుందని వెల్లడించాడు పిచ్‌పై 6 మిల్లీ మీటర్ల పచ్చిక ఉంటుందని పేర్కొన్నాడు.ఆరంభంలో పేస్‌కు సహకరించినా...అయితే, ఫ్లడ్ లైట్ల వెలుతురులో గులాబీ బంతిని ఎదుర్కోవడం కొంచెం కష్టమే అని... అయితే పిచ్ అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు సహకరిస్తుందని హగ్ వెల్లడించాడు. ‘రికార్డులు పరిశీలిస్తే అడిలైడ్‌లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయడం కష్టమనేది సుస్పష్టం. పిచ్‌పై పచ్చిక ఉండనుంది. ఆరంభంలో పేస్‌కు సహకరించినా... మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపగలరు.బంతి పాతబడే వరకు కుదురుకుంటే పరుగులు రాబట్టడం పెద్ద కష్టం కాదు. అడిలైడ్‌లో స్పిన్ కీలక పాత్ర పోషించడం పరిపాటి. ఇక్కడ ఆడేటప్పుడు ప్రధాన స్పిన్నర్ తుది జట్టులో ఉండాల్సిందే. మ్యాచ్ ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపితే... రాత్రి పూట స్పిన్నర్లు ప్రమాదకరం’ అని హగ్ తెలిపాడు. గతంలొ 36 పరుగులకే ఆలౌట్‌కాగా పెర్త్‌లో జరిగిన టెస్టులో భారత్ ఆసీస్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టును ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది బుమ్రా సేన. ఇక అడిలైడ్ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. కాగా 2020లో ఇదే వేదికపై భారత జట్టు 36 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డును మూటగట్టుకుంది.చదవండి: ‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’ -
రోహిత్ వచ్చాడు!.. మరి మీ పరిస్థితి ఏంటి?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న పింక్ బాల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఇక ఈ టెస్టు కోసం రెగ్యులర్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరడంతో.. భారత తుదిజట్టు కూర్పుపై చర్చలు నడుస్తున్నాయి.రాణించిన రాహుల్కాగా పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ గైర్హాజరైన నేపథ్యంలో.. పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు. ఈ పేస్ బౌలర్ కెప్టెన్సీల్లో భారత్ కంగారూలను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక ఈ విజయంలో.. బ్యాటింగ్ విభాగంలో ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(161), కేఎల్ రాహుల్(77)లతో పాటు విరాట్ కోహ్లి(100 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ రాకతో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అడిలైడ్ టెస్టులో ఈ కర్ణాటక బ్యాటర్ ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే మిడిలార్డర్లో బరిలోకి దిగుతాడా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తుదిజట్టులో చోటు ఉండాలి కదా!‘‘ముందుగా నాకు తుదిజట్టులో చోటు దక్కడమే ముఖ్యం. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలోనైనా ఆడతా. ఓపెనర్‌గా అయినా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా అయినా జట్టును గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తా.మొదట్లో కాస్త కష్టంగా ఉండేది..ఇప్పటి వరకు నా కెరీర్లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. మొదట్లో కాస్త కష్టంగా ఉండేది. అయితే, అది కూడా టెక్నిక్ పరంగా కాకుండా.. మానసికంగా కాస్త ఇబ్బందిగా ఉండేది. తొలి 20 -25 బంతుల పాటు కఠినంగా తోచేది.ఇక ఇప్పటికి చాలాసార్లు నేను టెస్టుల్లో, వన్డేల్లో వేర్వేరు స్థానాల్లో ఆడాను కాబట్టి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ స్థానంలో ఎలా ఆడాలో నాకు స్పష్టత ఉంది. తొలి 30- 40 బంతుల పాటు నిలదొక్కుకోగలిగితే.. ఆ తర్వాత నా రెగ్యులర్ స్టైల్లో ముందుకు సాగడం తేలికవుతుంది’’ అని స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.విదేశీ గడ్డపై ఐదుకాగా కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు తన కెరీర్లో 54 టెస్టులు ఆడి 3084 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది శతకాలు ఉండగా.. వీటిలో రెండు సౌతాఫ్రికా, రెండు ఇంగ్లండ్, ఒకటి ఆస్ట్రేలియాలో సాధించినవి. ఇక పెర్త్ టెస్టులోనూ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన అర్ధ శతకం(77)తో రాణించాడు.శుబ్‌మన్ గిల్ కూడా వచ్చేశాడుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మతో పాటు శుబ్‌మన్ గిల్ కూడా రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ మారటంతో పాటు.. ధ్రువ్ జురెల్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
Ashes Series 2nd Test: నువ్వు కెప్టెన్‌గా ఉండి ఏం లాభం: రికీ పాంటింగ్
Ricky Ponting Comments On Joe Root Captaincy: ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ తీరును ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ విమర్శించాడు. అసలు కెప్టెన్‌గా ఉండి ఏం లాభం అంటూ ఘాటు విమర్శలు చేశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 275 పరుగుల తేడాతో ఓటమి పాలై భంగపాటుకు గురైంది. మరోవైపు .. సిరీస్ ఆరంభం నుంచి దూకుడు మీదున్న ఆతిథ్య ఆసీస్ జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన జో రూట్ తమ బౌలర్ల ప్రదర్శనపై పెదవి విరిచాడు. సరైన లెంత్‌తో బౌల్ చేయలేకపోయారని వాపోయాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన తప్పిదాలే పునరావృతమయ్యాయని.. ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మొదటి ఇన్నింగ్స్‌లో నిలకడలేమి కారణంగా ప్రత్యర్థిని కట్టడిచేయలేపోయామని పేర్కొన్నాడు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘నిజంగా రూట్ మాటలు వినగానే షాక్‌కు గురయ్యాను. బౌలర్లను మార్చాల్సింది ఎవరు? నువ్వు కెప్టెన్‌గా ఉండి ఏం చేస్తున్నావు? బౌలర్ల లైన్ లెంగ్త్ గురించి సలహాలు ఇవ్వలేవా? నువ్వు అసలు మైదానంలో ఏం చేస్తున్నావు?’’ అని మండిపడ్డాడు. అదే విధంగా... ‘‘కెప్టెన్‌గా.. నీకెలాంటి ప్రదర్శన కావాలో బౌలర్లకు చెప్పాలి. నువ్వు ఆశించినట్లుగా జరగడం లేదని భావించినపుడు వాళ్లను మార్చాలి. నీ వ్యూహాలను అమలు చేసే బౌలర్లను రంగంలోకి దించాలి. ప్రత్యర్థి బ్యాటర్లను అవుట్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రచించావో.. వాళ్లు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలి. ముందు వాళ్లతో ఓపెన్‌గా మాట్లాడాలి. అది కదా కెప్టెన్సీ అంటే’’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడు. రెండో టెస్టు- స్కోర్లు: ►ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 473-9 డిక్లేర్డ్ ►రెండో ఇన్నింగ్స్: 230-9 డిక్లేర్డ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 236-10 ఆలౌట్ ►రెండో ఇన్నింగ్స్: 192 ఆలౌట్ చదవండి: Ashes Series 2nd Test: చివరి రోజు 69.5 ఓవర్ల పాటు బ్యాటింగ్... 50.4 ఓవర్లు ఎదుర్కొంది ఆ ఇద్దరే! What a way to end an epic innings! 😲 That's the first time Buttler has been dismissed hit wicket in his 193-innings first class career #Ashes pic.twitter.com/nRP09djjay — cricket.com.au (@cricketcomau) December 20, 2021 -
Ashes 2nd Test: రిచర్డ్సన్ పాంచ్ పటాకా.. ఇంగ్లండ్ ఘోర పరాజయం
Jhye Richardson Maiden Five Wicket Haul: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిధ్య ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆసీస్ పేసర్ జై రిచర్డ్సన్(5/42) కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన రిచర్డ్సన్ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయి బర్న్స్(34), హమీద్(0), బట్లర్(26), క్రిస్ వోక్స్(44), ఆండర్సన్(2) వికెట్లు సాధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే కుప్పకూలింది. 82/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. రిచర్డ్సన్, మిచెల్ స్కార్క్(2/43), నాథన్ లయన్(2/55), మైఖేల్ నెసర్(1/28) ధాటికి 192 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(103), రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ(51) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మార్నస్ లబుషేన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 473/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 230/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 468 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. ఛేదనలో ఇంగ్లండ్192 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది. చదవండి: పిచ్‌ను చూసి షాక్‌కు గురైన శ్రేయాస్.. ప్రాక్టీస్‌లో నిమగ్నం కావాలన్న ద్రవిడ్ -
Ashes 2nd Test: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన ఘనత..
Australia vs England: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 150 మ్యాచ్‌లు ఆడిన మూడో ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. బ్రాడ్‌కు ముందు జేమ్స్ ఆండర్సన్(167 టెస్ట్‌లు), అలిస్టర్ కుక్(161) ఇంగ్లండ్ తరఫున ఈ ఘనతను సాధించారు. Congratulations on an incredible achievement, @StuartBroad8! 👏#Ashes | 🇦🇺 #AUSvENG 🏴 pic.twitter.com/ySqWgT2Dcb — England Cricket (@englandcricket) December 16, 2021 ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్(200) పేరిట ఉండగా.. బ్రాడ్ 10వ స్థానంలో నిలిచాడు. 35 ఏళ్ల బ్రాడ్ ప్రస్తుతం 525 అంతర్జాతీయ టెస్ట్ వికెట్లతో అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్(708), జేమ్స్ ఆండర్సన్(632)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ప్రసుత్తం ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లబూషేన్ (95 నాటౌట్), తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ (18 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(95) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్, బ్రాడ్‌కు తలో వికెట్ పడగొట్టారు. చదవండి: విరాట్‌లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
Ashes 2nd Test: పాపం వార్నర్.. వందేళ్లలో ఒకే ఒక్కడు
Australia Vs England: యాషెస్ సిరీస్ 2021-22లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను దురుదృష్టం వెంటాడుతుంది. వరుస ఇన్నింగ్స్‌ల్లో తొంబైల్లోకి చేరిన ఈ మాజీ ఎస్ఆర్హెచ్ ఆటగాడు.. రెండుసార్లు సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. గబ్బాలో జరిగిన తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల వద్ద ఔటైన డేవిడ్ భాయ్.. ప్రస్తుతం అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సైతం తొంబైల్లోనే వెనుదిరిగాడు. తొలి టెస్ట్‌లో గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగని వార్నర్.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ బౌలింగ్‌లో బ్రాడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా యాషెస్ చరిత్రలో గత వందేళ్లలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీకి చేరువగా వచ్చి తొంబైల్లో ఔట్ అయిన తొలి ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా అరుదైన రికార్డును సాధించాడు. వార్నర్‌కు ముందు 1921లో టామీ ఆండ్రూస్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో తొంబైల్లో ఔట్ అయ్యాడు. కెరీర్లో గడిచిన 159 ఇన్నింగ్స్‌ల్లో 90 పరుగుల మార్కు దాటాక ఒక్కసారి మాత్రమే ఔటైన వార్నర్.. గత రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా తొంబైల్లోనే నిష్క్రమించడం విశేషం. వార్నర్ తన 88 టెస్ట్‌ల కెరీర్లో 24 సార్లు సెంచరీ మార్కును విజయవంతంగా అందుకున్నాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లబూషేన్ (95 నాటౌట్), తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ (18 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: అప్పట్లో సచిన్, ఇప్పుడు కోహ్లి.. ఇద్దరినీ ఒకేలా అవమానించారు..! -
Ashes 2021-22 Adelaide Test: ఇంగ్లండ్ జట్టు ఇదే.. బరిలో అండర్సన్
England 12- Member Squad: ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టు తాము ఆడిన ఎనిమిది డే అండ్ నైట్ టెస్టుల్లో గెలిచి అజేయంగా ఉంది. ఈ నేపథ్యంలో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో అడిలైడ్‌లో గురువారం మొదలయ్యే రెండో టెస్టులో ఆస్ట్రేలియా మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు ఇంగ్లండ్ రెండు మార్పులు చేసే అవకాశముంది. పేసర్లు అండర్సన్, బ్రాడ్ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో వీరిద్దరు తుది జట్టులో ఆడటం ఖాయమైంది. యాషెస్ సిరీస్ రెండో టెస్టుకు ఇంగ్లండ్ ప్రకటించిన జట్టు ఇదే: జో రూట్(కెప్టెన్), జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్, డేవిడ్ మలన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ పోప్, రోరీ బర్న్స్, ఓలీ రాబిన్సన్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, హసీబ్ హమీద్, క్రిస్ వోక్స్. చదవండి: యాషెస్ సిరీస్ 2021-22.. రెండో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ఇదే View this post on Instagram A post shared by We Are England Cricket (@englandcricket) -
చెత్త ఫీల్డింగ్‌పై సన్నీ సెటైర్లు
అడిలైడ్ : టీమిండియా చెత్త ఫీల్డిండ్పై మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ తన దైన శైలిలో స్పందించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు పలు క్యాచ్‌లు జారవిడిచారు. దీనిపై సునీల్ గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా ఆటగాళ్ల వరస్ట్ ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలియాకు వారం ముందుగానే క్రిస్మస్ పండుగ వచ్చిందని ఎద్దేవా చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 23వ ఓవర్లో మార్నస్ లబుషేన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పృథ్వీ షా నేలపాల్జేశాడు. దీనిపై గావస్కర్ స్పందిస్తూ.. క్రిస్మస్ మూడ్‌లో ఉన్న భారతీయులు వారం ముందుగానే బహుమతులు పంచిపెట్టారని వ్యాఖ్యానించాడు. (చదవండి: పృథ్వీ షా ఏందిది?) 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో లబుషేన్ క్యాచ్‌ను జస్ప్రీత్ బుమ్రా జారవిడిచాడు. భారత ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు వదిలేయడంతో ఆసీస్‌పై మరింత ఒత్తిడి పెంచే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. అయితే, అశ్విన్, ఉమేశ్ యాదవ్, బుమ్రా సమష్టిగా రాణించడంతో చివరకు తక్కువ స్కోరుకే ఆస్ట్రేలియాను టీమిండియా కట్టడి చేయగలిగింది. 191 పరుగుల వద్ద ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అశ్విన్ 4, ఉమేశ్ యాదవ్ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ రనౌటయ్యాడు. కెప్టెన్ పైన్(73) ఒంటరి పోరాటం చేసి నాటౌట్‌గా నిలిచాడు. (చదవండి: ఆసీస్ 191 ఆలౌట్, అశ్విన్ సక్సెస్) -
కోహ్లి రనౌట్; టీమిండియా టపాటపా
అడిలైడ్ : హమ్మయ్య.. మరో వికెట్ పడకుండా టీమిండియా కాచుకుంది. ఆరు వికెట్ల నష్టంతో తొలిరోజు ఆటను ముగించింది. జోరు మీదున్న ఆస్ట్రేలియా బౌలర్లు టీమిండియా బ్యాట్స్మన్లను వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టించడంతో ఒక దశలో ఆందోళన రేగింది. వృద్ధిమాన్ సాహా(9), రవిచంద్రన్ అశ్విన్(15) నాటౌట్‌గా నిలిచి తొలిరోజు ఆలౌట్ కాకుండా అడ్డుపడ్డారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. Critical moment in the series? pic.twitter.com/fhuvIzfBSC — ICC (@ICC) December 17, 2020 విహారి విఫలం కెప్టెన్ విరాట్ కోహ్లి ఔటయిన తర్వాత టీమిండియా వేగంగా వికెట్లు కోల్పోయింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కోహ్లి(74) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. కుదురుగా ఆడుతున్న అజింక్య రహానే (42) కూడా వెంటనే అవుటయ్యాడు. టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారి కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. 16 పరుగులు చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్ల జోరు చూస్తే టీమిండియాను మొదటి రోజే ఆలౌట్ చేసేలా కనిపించారు. కానీ సాహా, అశ్విన్ మొండిగా నిలబడి కాపు కాశారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. హాజిల్‌వుడ్, కమిన్స్, లయన్ తలో వికెట్ దక్కించుకున్నారు. పృథ్విషా డకౌట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆటగాడు పృథ్విషా రెండు బంతులను మాత్రమే ఎదుర్కొని స్టార్క్ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. మయాంక్ అగర్వాల్(17) కూడా నిరాశపరచడంతో ఇన్నింగ్స్‌కు మరమతు చేసే బాధ్యత పుజారా, కోహ్లి తీసుకున్నారు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరును వంద పరుగులకు చేర్చారు. జట్టు స్కోరు 100 పరుగుల వద్ద పుజారా(43) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. తర్వాత రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ను కోహ్లి చక్కదిద్దాడు. జట్టు స్కోరు 188 పరుగుల వద్ద కోహ్లి రనౌట్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. రహానే, విహారి వెంట వెంటనే ఔటవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా బౌలర్లే పైచేయి సాధించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండో రోజు ఆటలో ఆసీస్ బౌలర్లను భారత్ బ్యాట్స్‌మన్ ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి. (చదవండి : పృథ్వీ షా డకౌట్.. వైరలవుతున్న ట్వీట్స్) -
ఒక్క మ్యాచ్.. రెండు రికార్డులు
అడిలైడ్ : అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరగనున్న మొదటిటెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజాలుగా పిలవబడే సచిన్ టెండూల్కర్,బ్రియాన్ లారా రికార్డులను బద్దలుకొట్టే సువర్ణవకాశం కోహ్లికి వచ్చింది. ఆ రికార్డులు ఏంటనేది ఒకసారి పరిశీలిస్తే.. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అడిలైడ్ వేదికగా ఆసీస్‌పై అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా మొదటి స్థానంలో ఉన్నాడు. అడిలైడ్ వేదికలో 4 మ్యాచ్‌లాడిన లారా 76.25 సగటుతో 610 పరుగులు సాధించాడు. వీటిలో రెండు సెంచరీలు.. ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. కోహ్లి అడిలైడ్ వేదికగా 71.83 సగటుతో 431 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలున్నాయి. కోహ్లి లారా రికార్డును బ్రేక్ చేసేందుకు మరో 179 పరుగులు చేయాల్సి ఉంది. మొదటి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కోహ్లి ఆ పరుగులు చేస్తే లారా పేరిట ఉన్న రికార్డును చెరిపేసి తాను నంబర్‌వన్ స్థానాన్ని అధిగమిస్తాడు. (చదవండి : మీ అభిమానానికి థ్యాంక్స్ : కేఎల్ రాహుల్) ఇక రెండో రికార్డు చూసుకుంటే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టీమిండియా తరపున ఆస్ట్రేలియాపై వారి సొంతగడ్డపై 20 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు సాధించాడు. ఈ ఐకానిక్ ప్లేయర్ ఆసీస్ గడ్డపై 20 మ్యాచ్‌ల్లో 1809 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి కూడా సచిన్‌తో సమానంగా ఆరు సెంచరీలు సాధించాడు. అడిలైడ్‌లో కోహ్లి ఒక్క సెంచరీ సాధించినా సచిన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది. ఇక కోహ్లి ఆసీస్ గడ్డపై 12 మ్యాచ్‌లాడి 1274 పరుగులు సాధించాడు. అలా కోహ్లికి ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు సాధించే అరుదైన అవకాశం లభించింది. కాగా కోహ్లి మొదటి టెస్టు తర్వాత పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. కోహ్లి స్థానంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు నాయకత్వం వహించనున్నాడు. (చదవండి : 'విచారకరం.. నా ఇన్నింగ్స్ వారికే అంకితం') -
ఏదైనా సాధించగలమనే నమ్మకం పెంచింది
న్యూఢిల్లీ: భారత జట్టు 2018–19 సీజన్లో తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. అయితే అంతకు నాలుగేళ్ల క్రితమే ఒక టెస్టులో అద్భుత విజయానికి చేరువగా వచ్చి త్రుటిలో ఓటమి పాలైంది. నాటి మ్యాచ్‌లో తమ ఆటతీరు జట్టులో ఆత్మవిశ్వాసం నింపిందని, గట్టిగా ప్రయత్నిస్తే ఆస్ట్రేలియాలో విజయం సాధించగలమనే నమ్మకాన్ని పెంచిందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. 2014–15 సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టును గుర్తు చేసుకుంటూ అతను ఈ వ్యాఖ్య చేశాడు. ధోని గైర్హాజరులో ఈ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 315 పరుగులకు ఆలౌటై 48 పరుగుల తేడాతో ఓడింది. 175 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌తో 141 పరుగులు చేసిన కోహ్లి గెలుపు కోసం మరో 60 పరుగులు చేయాల్సిన దశలో నిష్క్రమించాడు. ఆ తర్వాత జట్టు కుప్పకూలింది. ఈ మ్యాచ్‌ను కోహ్లి సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నాడు. ‘ఈ రోజు మన టెస్టు జట్టు ఇంత మంచి స్థాయిలో ఉండటానికి కారణమైన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది. ఎంతో ప్రత్యేకమైన, కీలకమైన అడిలైడ్æ 2014 టెస్టు మ్యాచ్ జ్ఞాపకాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇరు జట్లూ ఎంతో భావోద్వేగంతో ఆ మ్యాచ్ ఆడాయి (మైదానంలో బంతి తగిలి ఆసీస్ ఆటగాడు ఫిల్ హ్యూజెస్ అనూహ్యంగా మృతి చెందిన కొద్ది రోజులకు ఈ టెస్టు జరిగింది). ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి దక్కింది. మేం గెలుపు తీరం చేరలేకపోయినా చేరువగా మాత్రం రాగలిగాం. మేం పూర్తి ఏకాగ్రతతో దృష్టి పెడితే ఏదైనా సాధ్యమే అని ఆ మ్యాచ్ నిరూపించింది. ఎవరూ అంతకుముందు ఊహించని విధంగా దాదాపు గెలిచినంత పని చేశాం. మేమెంతో అంకితభావంతో ఆడాం. టెస్టు జట్టుగా ఎదిగే క్రమంలో ఈ మ్యాచ్ ఎప్పటికీ ఒక మైలురాయిగా మిగిలిపోతుంది’ అని కోహ్లి ట్వీట్ చేశాడు. -
ఐదో రోజు ఆట: ఆసీస్ 186/6
అడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ విజయం ముంగిట నిలిచింది. 104/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు లంచ్ సమయానికి మరో రెండు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ట్రావిస్‌హెడ్ (14)ను ఇషాంత్ శర్మ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ టీమ్ పెయిన్‌తో షాన్ మార్ష్ ఆచితూచి ఆడాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన షాన్ మార్ష్ 146 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని బుమ్రా విడదీశాడు. మార్ష్(60:166 బంతుల్లో 5 ఫోర్లు)ను అద్భుత బంతితో పెవిలియన్ బాట పట్టించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కమిన్స్(5: 38 బంతులు)తో కెప్టెన్ పెయిన్(40: 68 బంతుల్లో 4 ఫోర్లు) పోరాడుతున్నాడు. భారత్ విజయానికి మరో నాలుగు వికెట్ల దూరంలో ఉండగా.. ఆసీస్ 137 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: అడిలైడ్ అందేందుకు ఆరు వికెట్లు -
అడిలైడ్ అందేందుకు ఆరు వికెట్లు
అడిలైడ్: పట్టును మరింత బిగిస్తూ, పై చేయిని కొనసాగిస్తూ, ప్రత్యర్థి వికెట్లను ఒకదాని వెంట ఒకటి పడగొడుతూ అడిలైడ్ టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది. మ్యాచ్‌ను పూర్తి నియంత్రణలోకి తీసుకుని, ప్రత్యర్థికి పరాజయం తప్పదనే పరిస్థితి కల్పించింది. బ్యాట్స్‌మెన్ బాధ్యత నెరవేర్చడంతో 323 పరుగుల కఠిన లక్ష్యం విధించి... బౌలర్లు మరింత మెరుగ్గా రాణించడంతో నాలుగో రోజు ఆట ముగిసేసరికి 104 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను ఆత్మరక్షణలోకి నెట్టింది. గెలవాలంటే కోహ్లి సేన ఆరు వికెట్లు పడగొట్టాల్సి ఉండగా, ఆతిథ్య జట్టు మరో 219 చేయాలి. క్రీజులో ఉన్న షాన్ మార్‡్ష (92 బంతుల్లో 31 బ్యాటింగ్; 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 11 బ్యాటింగ్; 1 ఫోర్) మినహా మరో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేనందున ‘డ్రా’గా ముగించాలన్నా వారు సోమవారమంతా ఆడాల్సి ఉంటుంది. అశ్విన్ (2/44) స్పిన్‌తో పాటు, ప్రభావవంతంగా బంతులేస్తున్న షమీ (2/15), ఇషాంత్, బుమ్రాలను తట్టుకుని నిలవడం ఏమంత సులువు కాదు. కాబట్టి... కంగారూల కథ చివరి రోజు రెండో సెషన్‌లోపే ముగిసేలా కనిపిస్తోంది. అంతకుముందు 151/3తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 307 పరుగులకు ఆలౌటైంది. భారత్ చివరి 4 వికెట్లు 4 పరుగులకే చేజార్చుకుంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (204 బంతుల్లో 71; 9 ఫోర్లు); అజింక్య రహానే (147 బంతుల్లో 70; 7 ఫోర్లు) అర్ధశతకాలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. రిషభ్ పంత్ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) ఎదురుదాడితో పరుగులు రాబట్టాడు. ఆసీస్ బౌలర్లలో లయన్ (6/122) ఆరు వికెట్లు పడగొట్టగా, స్టార్క్ (3/40)కు మూడు వికెట్లు దక్కాయి. అద‘రహానే’... టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లి, పుజారా తర్వాత నమ్మదగ్గ బ్యాట్స్‌మన్ అయిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే చాలా రోజుల తర్వాత చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు బాగా అవసరమైన సమయంలో పుజారాతో కలిసి నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. ఉదయం సెషన్‌ను వీరిద్దరూ నింపాదిగా ప్రారంభించారు. వ్యక్తిగత స్కోరు 40తో బరిలో దిగిన పుజారా కాసేపటికే అర్ధశతకం (140 బంతుల్లో) అందుకున్నాడు. 17 పరుగుల వద్ద ఉండగా అంపైర్ క్యాచ్ ఔట్ ఇచ్చినా సమీక్ష కోరి రహానే బయటపడ్డాడు. తర్వాత నుంచి అతడు వేగం పెంచాడు. అయితే, లంచ్‌కు కొద్దిగా ముందు పుజారాను లయన్ పెవిలియన్ పంపి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అర్ధ శతకం (111 బంతుల్లో) పూర్తి చేసుకుని రహానే ఊపుమీదుండగా... సహకరించాల్సిన స్థితిలో రోహిత్‌శర్మ (1) మరింత పేలవంగా ఔటయ్యాడు. క్రీజు వదలి ముందుకొచ్చిన అతడు సిల్లీ పాయింట్లో సులువైన క్యాచ్ ఇచ్చాడు. పంత్ ఔటయ్యాక అశ్విన్ (5)ను స్టార్క్ పెవిలియన్‌కు పం పాడు. స్కోరును సాధ్యమైనంత పెంచే ఉద్దేశంతో రివర్స్ స్వీప్‌నకు యత్నించిన రహానే... స్టార్క్‌కు చిక్కాడు. తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి షమీ (0) వెనుదిరిగాడు. ఏడు బంతుల వ్యవధిలో ఈ మూడు వికెట్లు పడిపోయాయి. ఇషాంత్ (0)ను పెవిలియన్ పంపి స్టార్క్ భారత్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఆసీస్... ఆపసోపాలు ఒకరికి ఇద్దరు బ్యాట్స్‌మెన్ నిలిస్తేనే ఛేదించగలిగే భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియాకు ఇషాంత్ మొదటి ఓవర్లోనే చుక్కలు చూపాడు. రెండో బంతికే ఓపెనర్ అరోన్ ఫించ్ (11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ, బ్యాట్స్‌మన్ సమీక్ష కోరగా నోబాల్‌గా తేలింది. తర్వాత వంతుగా వచ్చిన షమీ... ఇంకా కట్టుదిట్టంగా బంతులేశాడు. అశ్విన్‌కు 9వ ఓవర్లో బంతినివ్వడం ఫలితమిచ్చింది. అతడి బౌలింగ్‌లో ఫించ్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే రీప్లేలో బంతి ఫించ్ బ్యాట్‌కు తాకలేదని తేలింది. ఫించ్ సమీక్ష కోరి ఉంటే బతికిపోయేవాడు! కంగారూలు 28/1తో టీకి వెళ్లారు. విరామం అనంతరం హారిస్ (26)ను వెనక్కు పంపి షమీ బ్రేక్ ఇచ్చాడు. మరోసారి క్రీజులో పాతుకుపోయేందుకు యత్నిస్తున్న ఉస్మాన్ ఖాజా (8)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. మార్‡్షకు కొద్దిసేపు తోడ్పాటు అందించిన హ్యాండ్స్కోంబ్(14)... షమీ బౌలింగ్‌లో పుల్ చేయబోయి మిడ్ వికెట్లో పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. జట్టు 84/4తో నిలిచిన సందర్భంలో మార్‡్ష, హెడ్ జోడీ 12 ఓవర్లపైగా వికెట్ కాపాడుకుని రోజును ముగించింది. సోమవారం ఇదీ సీన్... అడిలైడ్‌లో 315 పరుగులే ఇప్పటివరకు ఆసీస్‌కు అత్యధిక ఛేదన. అది కూడా 1902లో ఇంగ్లండ్‌పై సాధించింది. 323 లక్ష్యాన్ని అందుకుని వారిప్పుడు ఈ రికార్డును తిరగరాయాలంటే సోమవారం మార్‡్ష, హెడ్ సామర్థ్యానికి మించి ఆడాలి. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లో మార్‡్ష టచ్‌లోకి వచ్చాడు. హెడ్ తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేశాడు. వీరితో పాటు టిమ్ పైన్ ఒక సెషన్ అయినా నిలవాల్సి ఉంటుంది. భారత పేస్ త్రయం, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌ను ఎదుర్కొంటూ ఇదేమంత సులువు కాదు. పంత్ పటాకా... భారత ఇన్నింగ్స్‌లో కాసేపే అయినా, రిషభ్ పంత్ ఆట హైలైట్‌గా నిలిచింది. లంచ్ నుంచి రాగానే పంత్... లయన్‌పై విరుచుకుపడి మూడు ఫోర్లు, సిక్స్ బాదాడు. స్వే్కర్ లెగ్ దిశగా అతడు కొట్టిన సిక్స్‌కు బంతి డగౌట్ రూఫ్‌పై పడింది. కానీ, మరుసటి ఓవర్ తొలి బంతికే లయన్ తన ఆట కట్టించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 250 ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 235 భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 44; విజయ్ (సి) హ్యాండ్స్కోంబ్ (బి) స్టార్క్ 18; పుజారా (సి) ఫించ్ (బి) లయన్ 71; కోహ్లి (సి) ఫించ్ (బి) లయన్ 34; రహానే (సి) స్టార్క్ (బి) లయన్ 70; రోహిత్ శర్మ (సి) హ్యాండ్స్కోంబ్ (బి) లయన్ 1; పంత్ (సి) ఫించ్ (బి) లయన్ 28; అశ్విన్ (సి) హారిస్ (బి) స్టార్క్ 5; ఇషాంత్ (సి) ఫించ్ (బి) స్టార్క్ 0; షమీ (సి) హారిస్ (బి) లయన్ 0; బుమ్రా (0 నాటౌట్); ఎక్స్‌ట్రాలు 36; మొత్తం (106.5 ఓవర్లలో ఆలౌట్) 307. వికెట్ల పతనం: 1–63, 2–76, 3–147, 4–234, 5–248, 6–282, 7–303, 8–303, 9–303, 10–307. బౌలింగ్: స్టార్క్ 21.5–7–40–3; హాజల్‌వుడ్ 23–13–43–1; కమిన్స్ 18–4–55–0; లయన్ 42–7–122–6; హెడ్ 2–0–13–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఫించ్ (సి) పంత్ (బి) అశ్విన్ 11; హారిస్ (సి) పంత్ (బి) షమీ 26; ఖాజా (సి) రోహిత్ (బి) అశ్విన్ 8; షాన్ మార్‡్ష (31 బ్యాటింగ్); హ్యాండ్స్కోంబ్ (సి) పుజారా (బి) షమీ 14; హెడ్ (11 బ్యాటింగ్); ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (49 ఓవర్లలో 4 వికెట్లకు) 104. వికెట్ల పతనం: 1–28, 2–44, 3–60, 4–84. బౌలింగ్: ఇషాంత్ 8–3–19–0; బుమ్రా 11–5–17–0; అశ్విన్ 19–4–44–2; షమీ 9–3–15–2; విజయ్ 2–0–7–0. హారిస్ వికెట్ తీసిన షమీ ఉత్సాహం -
ఆసీస్‌తో ఆరంభమైన తొలి టెస్టు మొదటి రోజు
-
అడిలైడ్ టెస్ట్ మ్యాచ్.. చిక్కుల్లో భారత్
అడిలైడ్ : ఆస్ట్రేలియాలో ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తడబడింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లోకేష్ రాహుల్ (2), మురళీ విజయ్ (11), విరాట్ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్ శర్మ(37), రిషబ్ పంత్(25)లు పెవిలియన్‌కు చేరారు. 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో రోహిత్ శర్మ-రిషబ్ పంత్‌లు కాసేపు మరమ్మత్తులు చేశారు. ఆపై వీరిద్దరూ సైతం వెనుదిరగడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. టీమిండియా కోల్పోయిన ఆరు వికెట్లలో హాజిల్‌వుడ్, నాథన్ లియాన్లు తలో రెండు వికెట్లు సాధించగా, స్టార్క్, కమిన్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.టీ విరామానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులతో ఉంది. పుజారా(46) క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కంగారూ బౌలర్లు పదునైన బంతులు సంధించడంతో టీమిండియా త్వరగా వికెట్లు నష్టపోయింది. 15 పరుగులకే ఓపెనర్లు రాహుల్, విజయ్ పెవిలియన్‌కు చేరారు. తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లి వెంటనే అవుటయ్యాడు. రహానే కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా, రోహిత్‌తో కలిసి కాసేపు పోరాడాడు. ఈ జోడిని లియాన్ విడదీశాడు. కుదురుకుంటున్న రోహిత్‌ను పెవిలియన్‌ను పంపాడు. ఆపై కాసేపటికి రిషబ్ పంత్‌ను కూడా లియాన్ ఔట్ చేసి భారత్‌కు మరో షాకిచ్చాడు. -
పచ్చిక పిలుస్తోంది!
అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు వేదిక అయిన అడిలైడ్ ఓవల్ మైదానంలో గత మూడు సీజన్లలో మూడు డే అండ్ నైట్ టెస్టులు జరిగాయి. ఏ మ్యాచ్ కూడా పూర్తిగా ఐదు రోజుల పాటు సాగలేదు. ఆ మ్యాచ్‌లలో గులాబీ బంతి మన్నిక కోసం పిచ్‌పై కాస్త ఎక్కువ పచ్చికను ఉంచారు. ఫలితంగా ఆరంభంలో పిచ్ పేస్‌కు బాగా అనుకూలించింది. ఈసారి డే అండ్ నైట్ టెస్టు కాకపోయినా... తాము అదే తరహాలో పిచ్‌ను సిద్ధం చేస్తున్నామని క్యురేటర్ డామియెన్ హాఫ్ చెప్పాడు. ‘మేం డే టెస్టు కోసం భిన్నంగా ఏమీ చేయడం లేదు. అదే తరహాలో పిచ్‌ను రూపొందిస్తాం. పిచ్‌పై కొంత పచ్చిక ఉంటేనే అటు బ్యాట్‌కు, బంతికి మధ్య సమంగా పోరు సాగుతుందనేది మా నమ్మకం. ప్రస్తుతానికి మాత్రం మేం అదే పనిలో ఉన్నాం’ అని అతను అన్నాడు. టెస్టు సాగినకొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినా... మొదటి రోజు మాత్రం పేసర్లకు బాగా అనుకూలించే అవకాశం ఉంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన పేస్ బౌలర్లు ఉన్న నేపథ్యంలో సిరీస్‌కు ఆసక్తికర ఆరంభం లభించవచ్చు. అరవడం కంటే కరవడం ముఖ్యం! బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత మైదానంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల వ్యవహారశైలి మారిపోయిందని, వారంతా బుద్ధిగా వ్యవహరిస్తారని తరచూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే మాటల్లో తీవ్రత లేకపోయినా... తమ దూకుడు మాత్రం తగ్గదని ఆసీస్ బ్యాట్స్‌మన్ ట్రవిస్ హెడ్ అన్నాడు. తమ బౌలర్లు ఆ పని చేయగలరని అతను అభిప్రాయపడ్డాడు. ‘అవసరం లేకపోయినా మాట్లాడే మాటలకు విలువే ఉండదు. మా బౌలర్లు స్టార్క్ 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి, కమిన్స్, హాజల్‌వుడ్ బౌన్స్‌తో చెలరేగి మైదానంలో దూకుడును ప్రదర్శిస్తారు. బ్యాటింగ్‌లో, ఫీల్డింగ్‌లో కూడా ఇలాగే చేస్తాం. టీవీల్లో ఇది కనిపించకపోవచ్చు. నా దృష్టిలో అరిచే కుక్కకంటే కరిచే కుక్క ఎక్కువ ప్రభావం చూపిస్తుంది’ అని హెడ్ అన్నాడు. కెరీర్లో 2 టెస్టులే ఆడిన హెడ్‌కు అడిలైడ్ సొంత మైదానం. ఆసీస్ కూర్పు ప్రకారం చూస్తే అతడికి తుది జట్టులో చోటు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న హ్యారీ నీల్సన్ నుంచి తాను కొన్ని సూచనలు తీసుకుంటానని అతను చెప్పాడు. కోహ్లిని ఇబ్బంది పెట్టగలం: పైన్ భారత కెప్టెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం తమ పేసర్లను ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. తమ బౌలర్లు భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం కూడా లేదని అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘మా బౌలర్లు తమ స్థాయిలో సత్తా చాటితే విరాట్ కోహ్లిని అడ్డుకోగలరు. అయితే మరీ ఎక్కువగా భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తే మా ఆట దెబ్బ తింటుంది. మేం బాగా బౌలింగ్ చేస్తుంటే కోహ్లితో మాటల యుద్ధం అనే ప్రశ్నే తలెత్తదు. ఒక్కో ఆటగాడు తమకు అలవాటైన రీతిలో ఆడితే చాలు. అవసరమైతే కోహ్లితో ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యవహరించాల్సి వచ్చినా తప్పు లేదు. అయితే హద్దులు దాటకుండా ఉంటే చాలు’ అంటూ పైన్ తమ జట్టు ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. -
పృథ్వీషా ఔట్!
సన్నాహక మ్యాచ్‌లు ఆడకనే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో టెస్టు సిరీస్‌లు కోల్పోయారన్న విమర్శల కారణంగా... ఆస్ట్రేలియాలో మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకోవాలన్న సూచనలతో... పర్యటన ప్రారంభానికి ముందు ఓ నాలుగు రోజుల మ్యాచ్ ఏర్పాటు చేసుకున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం సీఏ ఎలెవెన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ యువ సంచలనం పృథ్వీ షా మడమ గాయానికి గురయ్యాడు. గాయం తీవ్రత దృష్ట్యా పృథ్వీ ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో ప్రాక్టీస్ సంగతి ఏమో కాని, ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ సేవలను కోల్పోయి అసలుకే ఎసరొచ్చినట్లయింది. అనవసర ప్రయత్నంతో.. సీఏ ఎలెవెన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో డీప్ మిడ్ వికెట్ దిశగా మ్యాక్స్ బ్రయాంట్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ వద్ద పృథ్వీ అందుకునేందుకు యత్నించాడు. పరుగున వచ్చిన అతడు... బంతిని క్యాచ్ పట్టాడు కానీ, నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో అతడి ఎడమ పాదం పూర్తిగా మెలికపడింది. ఆ నొప్పితోనే అతడు బంతి సహా బౌండరీ లైన్ దాటేశాడు. అంతగా ప్రయత్నించాల్సిన పని లేకున్నా... పృథ్వీ అనవసరంగా తొందరపడి గాయాన్ని కొని తెచ్చుకున్నాడు. జట్టుకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. మరోవైపు పృథ్వీ ప్రస్తుతానికి తొలి టెస్టుకే అందుబాటులో ఉండడని అంటున్నారు. గాయం తీరు చూస్తే రెండో టెస్టు నాటికీ అతడు కోలుకోవడం అనుమానంగానే ఉంది. మైదానం నుంచి పృథ్వీని ఫిజియో, సహాయక సిబ్బంది చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లగా... ఆస్పత్రిలో చికిత్స అనంతరం అతడు క్రచెస్ (ఊత కర్రల)సాయంతో బయటకు రావడం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. ఓపెనింగ్ జోడీ ఎవరో? నిన్నటివరకు పృథ్వీకి ఓపెనింగ్ జోడీ కేఎల్ రాహులా? మురళీ విజయా? అనే సందిగ్ధం ఉండేది. ఇప్పుడు యువ బ్యాట్స్‌మన్ గాయంతో వైదొలగడంతో అసలు ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరో తేలడం లేదు. ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే ప్రాథమికంగా స్పెషలిస్ట్ ఓపెనర్లైనందున రాహుల్, విజయ్‌నే దింపే అవకాశం ఉంది. కానీ, ఈ ఇద్దరి ఫామ్ దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పక్కనే ఉన్న న్యూజిలాండ్‌లో ‘ఎ’ జట్ల సిరీస్‌లో పాల్గొంటున్న మయాంక్ అగర్వాల్‌ను రప్పించినా, పూర్తిగా కొత్తవాడైన అతడిని ఆస్ట్రేలియా వంటి జట్టుపై బరిలో దింపడం సాహసమే అవుతుంది. అయితే, మరో ప్రయత్నమూ చేయొచ్చని అనిపిస్తోంది. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ రోహిత్‌శర్మను ఓపెనర్‌గా పంపడం. రోహిత్ ఇప్పటివరకు ఆరో స్థానానికే పోటీదారుగా ఉన్నాడు. మరోవైపు జట్టు అవసరాలను గుర్తించిన అతడు కొంతకాలం క్రితం టెస్టుల్లో తాను ఓపెనింగ్‌కైనా సిద్ధమని ప్రకటించాడు. ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే పోయేదేమీ లేదని టీం మేనేజ్మెంట్ భావిస్తే... ఆడిలైడ్ టెస్టులో రోహిత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించినా ఆశ్చర్యం లేదు. చూద్దాం... ఏం జరుగుతుందో? -
ఆదిలోనే కోహ్లిసేనకు ఎదురుదెబ్బ!
సిడ్నీ : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ముందే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే 4 టెస్ట్‌ల సిరీస్ సన్నాహకంలో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్‌తో జరుగుతోన్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో యువకెరటం, ఓపెనర్ పృథ్వీషా గాయపడ్డాడు. సీఏ ఎలెవన్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఓపెనర్ మ్యాక్స్ బ్రియాంట్ క్యాచ్ అందుకునే క్రమంలో ఈ ముంబై క్రికెటర్ ఎడమ చీలిమండకు గాయమైంది. అతని ఎడమ మడిమ సుమారు 90 డిగ్రీలు వంగిపోయింది. వెంటనే ఫిజియోలు షాను ఆసుపత్రికి తరిలించి పరీక్షలు జరిపారు. అతని చీలిమండ కీలుకు గాయం అయిందని తేలడంతో పృథ్వీషా తొలి అడిలైడ్ టెస్ట్ ఆడటం లేదని బీసీసీఐ పేర్కొంది. ఇక వెస్టిండీస్‌తో అరంగేట్ర టెస్ట్‌లోనే శతకం బాధిన పృథ్వీ షా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతోనే ప్రతిష్టాత్మక ఆసీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సైతం పృథ్వీ షా (69 బంతుల్లో 66; 11 ఫోర్లు) తనదైన శైలిలో చెలరేగాడు. మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీషా ఇలా గాయంతో జట్టుకు దూరం కావడం కోహ్లిసేనకు తీరని లోటే. అసలే టాపర్డర్‌లో ఎవరిని ఆడించాలని తలపట్టుకుంటున్న టీమిండియా మేనేజ్మెంట్కు పృథ్వీషా గాయం మరింత చిక్కులో పడేసింది. ఇక షా రెండో టెస్ట్‌లోపు అందుబాటులోకి వస్తాడా లేక సిరీస్ నుంచి దూరమవుతాడా? అనేది అతని గాయం తీవ్రతపై ఆధారపడి ఉంది. ఒక వేళ షా సిరీస్ మొత్తం దూరమైతే.. అతని స్థానంలో శిఖర్‌కు అవకాశం కల్పించవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Update: The medical team is assessing Prithvi Shaw at the moment. He hurt his left ankle while attempting to take a catch at the boundary ropes. Shaw is being taken to the hospital for scans #TeamIndia pic.twitter.com/PVyCHBO98e — BCCI (@BCCI) November 30, 2018 -
ఆసీస్‌దే అడిలైడ్ టెస్టు
అడిలైడ్: ఇంగ్లండ్ పోరాటం... కెప్టెన్ రూట్ పట్టుదలతో ఉత్కంఠ రేపిన యాషెస్ సిరీస్‌లోని రెండో టెస్టు ఫలితం చివరకు ఆస్ట్రేలియా వైపే మొగ్గింది. పేసర్లు మిచెల్ స్టార్క్ (5/88), హాజల్‌వుడ్ (2/49) ధాటికి పర్యాటక జట్టు అయిదో రోజు 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. 354 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్ 120 పరుగులతో ‘యాషెస్ తొలి డే నైట్’ టెస్టును గెలుచుకుని సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 176/4తో బుధవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ను హాజల్‌వుడ్ దెబ్బ తీశాడు. రూట్ (67; 9 ఫోర్లు), వోక్స్ (5)లను ఓవర్‌నైట్ స్కోర్ వద్దే అవుట్ చేశాడు. మొయిన్ అలీ (2) విఫలమయ్యాడు. ఓవైపు బెయిర్ స్టో (36; 5 ఫోర్లు) నిల్చున్నా... ఓవర్టన్ (7), బ్రాడ్ (8)లను స్టార్క్ వెనక్కి పంపాడు. చివరికి అతడి బౌలింగ్‌లోనే బెయిర్‌స్టో అవుటయ్యాడు. మూడో టెస్టు ఈనెల 14 నుంచి పెర్త్‌లో జరుగుతుంది. -
ఢీఆర్ఎస్...
ప్రస్తుతం అమల్లో ఉన్న డీఆర్ఎస్ పద్ధతిపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి. అది 100 శాతం సరైందని తేలే దాకా దానిని అంగీకరించేది లేదు... చాలా ఏళ్లుగా బీసీసీఐ వినిపిస్తున్న వాదన ఇది. బీసీసీఐ తమ ఆధిపత్యం కోసమే ఇలాంటి వాదన వినిపిస్తోంది. సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడే ఈ పద్ధతిని అమలు చేయడం ఎంతో అవసరం... భారత్ మినహా దీనిని వాడుతున్న మిగతా దేశాల మాట ఇది. డీఆర్ఎస్ అంటేనే లోపాల పుట్ట. ఒక్క తప్పుడు నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది... అడిలైడ్ డేనైట్ టెస్టు తర్వాత ప్రపంచం మొత్తం ఏకమై పలుకుతున్న మాట ఇది. ఒక్క దెబ్బతో అంతా భారత్ బాటలోకే వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి మనగలుగుతుందా... ప్రస్తుత తరహాలోనే కొనసాగిస్తారా లేక ఐసీసీ మార్పులు చేస్తుందా? * టెక్నాలజీపై కొత్త సందేహం * అడిలైడ్ టెస్టులో బయటపడ్డ లోపాలు * భారత్‌ను ఒప్పించడం కష్టమే! సాక్షి క్రీడా విభాగం: అడిలైడ్ టెస్టులో లయోన్ అవుట్ గురించి రివ్యూ చేస్తున్న సమయంలో హాట్‌స్పాట్ మార్క్ ‘మరే కారణంగానైనా’ వచ్చి ఉండవచ్చు. బంతి లయోన్ బ్యాట్‌కు తగిలిందని కచ్చితంగా చెప్పలేము అంటూ థర్డ్ అంపైర్ నెజైల్ లాంగ్, ఫీల్డ్ అంపైర్ రవికి చెప్పడం అందరికీ వినిపించింది. ఈ మరే కారణం ఏమిటో అంపైర్ సెలవిస్తారా అంటూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. హాట్‌స్పాట్ పని తీరు ఎంత నాసిరకంగా ఉందో అనేదానికి ఇది చక్కటి ఉదాహరణ. అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)కి సంబంధించి ఇప్పటి వరకు ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల విషయంలోనే సందేహాలు ఉండేవి. ఇప్పుడు బ్యాట్ క్యాచ్ అవుట్లను కూడా గుర్తించలేని స్థితిలో టెక్నాలజీ ఉందంటే దానిని వాడటం అవసరమా అనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. దెబ్బ తిన్న భారత్ డీఆర్ఎస్ను మొదటిసారి 2008లో భారత్, శ్రీలంక మధ్య సిరీస్‌లో వాడినప్పుడు దాదాపు అన్ని నిర్ణయాలు టీమిండియాకు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ పద్ధతిలో ఎల్బీగా అవుటైన తొలి బ్యాట్స్‌మన్ సెహ్వాగ్. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టె స్టు సిరీస్‌లో ‘ద్రవిడ్ రిమూవల్ సిస్టం’గా దీనిపై విమర్శలు వచ్చాయి. అంతకు ముందు వరల్డ్ కప్‌లో కూడా ఇలాంటి నిర్ణయం ధోనిని తీవ్ర అసహనానికి గురి చేసింది. దాంతో డీఆర్ఎస్కు రాంరాం పలికిన బీసీసీఐ ఇప్పటికీ దాని ఊసెత్తలేదు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కెప్టెన్ కోహ్లితో పాటు బోర్డు కూడా కాస్త మెత్తబడింది. అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కూడా ఎల్బీలకు మినహా మిగతావాటికి అభ్యంతరం లేదన్నట్లుగా మాట్లాడారు. కానీ తాజా ఉదంతం భారత్ తమ వాదనకే కట్టుబడేట్లుగా చేసింది. పని తీరు-అభ్యంతరాలు మూడు రకాల వేర్వేరు టెక్నాలజీల సహాయంతో డీఆర్ఎస్ను అమలు చేస్తున్నారు. ఎల్బీలను నిర్ధారించేందుకు హాక్ ఐ (బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ)ని వాడుతున్నారు. ఇది బంతి దిశను సూచిస్తుంది. బ్యాట్స్‌మన్ బంతిని అడ్డుకోకపోతే అది వికెట్లను తాకేదా లేదా అనే విషయం తెలుస్తుంది. వివాదానికి ఇది పెద్దన్నలాంటిది. పిచ్ అయిన తర్వాత బంతి ప్రయాణించిన దూరం, వేగం ఇలాంటివన్నీ ఇందులో కలిసి ఉండటంతో చాలా గందరగోళం కనిపిస్తుంది. బంతి గమనం మారితే (డీవియేషన్) దానిని గుర్తించలేకపోవడం పెద్ద లోపం. పిచ్‌పై పడ్డ తర్వాత బంతి ఎలా వెళ్లవచ్చనేది నేరుగా నిలబడ్డ అంపైర్‌కు కనిపించినంత స్పష్టత ఇందులో సాధ్యం కాదనేది ఒక వాదన. దీనిపైన భారత్‌తో సహా ఎవరికీ పూర్తి విశ్వాసం లేదు. కానీ అలాగే కొనసాగిస్తున్నారు. అందరూ కాస్త విశ్వసించిన రెండో అంశం హాట్‌స్పాట్. బ్యాట్‌కు బంతి ఎడ్జ్ తీసుకుందా లేదా అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి క్యాచ్‌ల విషయంలో 90 శాతం వరకు సరైన ఫలితాలే వచ్చాయి. అయితే అడిలైడ్‌లో లయోన్ ఎడ్జ్ హాట్‌స్పాట్‌లో కనిపించినా...అది బ్యాట్ కాకపోవచ్చంటూ థర్డ్ అంపైర్ నిర్ణయించడమే కొత్త వివాదానికి కారణమైంది. అంటే ఎడ్జ్ కాకపోయినా హాట్ స్పాట్ చూపిస్తోందంటే అందులో లోపాలున్నట్లే. పైగా ఇది భారీ ఖర్చుతో కూడుకుంది కావడంతో బోర్డులు ఆసక్తి చూపించడం లేదు. బంతి బ్యాట్‌కు లేదా ప్యాడ్‌కు తగిలిందా శబ్దం సాయంతో గుర్తించేందుకు స్నికో మీటర్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే నెమ్మదిగా వచ్చే స్పిన్నర్ల బంతులతో పాటు బ్యాట్స్‌మన్ ముందుకు వచ్చి ఆడితే మైక్‌లు ఈ శబ్దాన్ని గుర్తించలేకపోతున్నాయి. ఆశ్చర్యకరంగా లయోన్ భుజానికి బంతి తగిలినా కూడా మీటర్లో అది ఏ మాత్రం కనిపించలేదు. మొత్తానికి డీఆర్ఎస్ పూర్తి భరోసానిచ్చేది కాదని మాత్రం అర్థమవుతోంది. మార్పులు చేస్తారా... అంపైర్లు మానవ మాత్రులే కాబట్టి తప్పులు చేస్తారు. దానిని తగ్గించేందుకు టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నాం అని ఐసీసీ చెబుతూ వస్తోంది. * అన్నీ కాకపోయినా...చాలా వరకు సరైన నిర్ణయాలే వస్తున్నాయని మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయ పడుతున్నారు. తాజా ఘటనతో ఇందులో లోపాలు ఉన్నాయనే భారత్ వాదనకు బలం చేకూరింది. అయితే ఏదీ 100 శాతం పర్ఫెక్ట్గా ఉండదని, మెరుగ్గా ఉన్నదానిని వాడాలని సూచనలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఐసీసీ టెక్నికల్ కమిటీ ఏకపక్షంగా డీఆర్ఎస్కు ఎర్రజెండా చూపించకపోయినా.... హాక్ ఐ నిబంధనల్లో మార్పులు, హాట్ స్పాట్, స్నికోలలో లోపాలు సవరిస్తూ మరి కాస్త మెరుగైన టెక్నాలజీ వాడి అడిలైడ్లాంటి ఘటన పునరావృతం కాకుండా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. తప్పు అంగీకరించిన ఐసీసీ అడిలైడ్ టెస్టులో నాథన్ లయోన్ను మూడో అంపైర్ నెజైల్ లాంగ్ నాటౌట్‌గా ప్రకటించడం తప్పుడు నిర్ణయమని ఐసీసీ అంగీకరించింది. లాంగ్ నిబంధనల ప్రకారమే వ్యవహరించినా... సరైన నిర్ణయం మాత్రం ఇవ్వలేకపోయారని అభిప్రాయపడింది. ఈ మ్యాచ్‌లో శాన్‌ట్నర్ బౌలింగ్‌లో స్వీప్ చేయబోయిన లయోన్ బ్యాట్‌కు తగిలిన బంతి అతని భుజం మీదుగా గల్లీలో ఫీల్డర్ చేతిలో పడింది. ఆ వెంటనే అవుట్‌గా భావించిన లయోన్ క్రీజ్ వదిలినా... ఫీల్డ్ అంపైర్ రవి నాటౌట్‌గా ప్రకటించాడు. న్యూజిలాండ్ రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ లాంగ్ సుదీర్ఘ సమయం తీసుకొని హాట్ స్పాట్, స్నికోల ద్వారా ఏమీ తేలడం లేదని బ్యాట్స్‌మన్‌ను నాటౌట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ నాటౌట్ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించింది. -
అడిలైడ్ టెస్ట్‌లో క్రికెటర్స్ గరం.. గరం