Australia vs England: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 150 మ్యాచ్‌లు ఆడిన మూడో ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. బ్రాడ్‌కు ముందు జేమ్స్ ఆండర్సన్(167 టెస్ట్‌లు), అలిస్టర్ కుక్(161) ఇంగ్లండ్ తరఫున ఈ ఘనతను సాధించారు.
Congratulations on an incredible achievement, @StuartBroad8! 👏#Ashes | 🇦🇺 #AUSvENG 🏴 pic.twitter.com/ySqWgT2Dcb
— England Cricket (@englandcricket) December 16, 2021
ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్(200) పేరిట ఉండగా.. బ్రాడ్ 10వ స్థానంలో నిలిచాడు. 35 ఏళ్ల బ్రాడ్ ప్రస్తుతం 525 అంతర్జాతీయ టెస్ట్ వికెట్లతో అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్(708), జేమ్స్ ఆండర్సన్(632)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ప్రసుత్తం ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లబూషేన్ (95 నాటౌట్), తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ (18 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(95) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్, బ్రాడ్‌కు తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: విరాట్‌లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment