లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు సన్నాహంగా ఐర్లాండ్‌తో ఆడుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ తొలిరోజే అన్ని విభాగాల్లో శాసించింది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఐర్లాండ్ 56.2 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ సీమర్ స్టువర్ట్ బ్రాడ్ (5/51) నిప్పులు చెరిగాడు.
దీంతో టాపార్డర్‌లో జేమ్స్ (36; 5 ఫోర్లు), పీటర్ మూర్ (10; 2 ఫోర్లు), కెప్టెన్ బాల్బిర్నీ (0) సహా... టెక్టర్ (0), లోయర్ ఆర్డర్‌లో అడెర్ (14; 2 ఫోర్లు)లు బ్రాడ్ పేస్ పదునుకు తలవంచారు. 98 పరుగులకు 5 వికెట్లు కోల్పోగా... ఇందులో 4 వికెట్లు బ్రాడ్‌వే! ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో క్యాంఫర్ (33; 6 ఫోర్లు), పాల్ స్టిర్లింగ్ (30; 5 ఫోర్లు) కాసేపు ఇంగ్లండ్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచారు.
స్పిన్నర్ జాక్ లీచ్ 2, మాథ్యూ పాట్స్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలీ (56; 11 ఫోర్లు), డకెట్ (60 బ్యాటింగ్; 8 ఫోర్లు) 16.3 ఓవర్లలోనే వేగంగా 109 పరుగులు జోడించారు. క్రాలీని హ్యాండ్ అవుట్ చేయగా, డకెట్‌తో ఒలీ పోప్ (29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 20 పరుగుల దూరంలోనే ఉంది. చేతిలో 9 వికెట్లున్నాయి.
చదవండి: Josh Tongue: ఇంగ్లండ్‌కు ఆడతాడని ఎప్పుడో పందెం కాసాడు.. ఇప్పుడు జాక్‌పాట్ కొట్టేశాడు
The I̶a̶n̶ ̶B̶e̶l̶l̶ Ollie Pope cover drive...
— England Cricket (@englandcricket) June 1, 2023
One of the most pleasing shots in cricket 😍
Get it on repeat 🔁 #EnglandCricket | #ENGvIRE pic.twitter.com/our07uvBgw
Comments
Please login to add a commentAdd a comment