
మహిళల ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 9) జరిగిన వన్డే మ్యాచ్‌లో (రెండో వన్డే) ఇంగ్లండ్ 275 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.
టామీ బేమౌంట్ (150 నాటౌట్) భారీ శతకంతో సత్తా చాటింది. బేమౌంట్‌కు ఫ్రేయా కెంప్ (65) సహకారం అందించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లీనా కెల్లీ, ఫ్రేయా సర్జంట్ చెరో రెండు.. అలీస్ టెక్టార్, జేన్ మగూర్, ఏమీ మగూర్ తలో వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. 16.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. ఐర్లాండ్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు (ఉనా రేమండ్ (22)) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్, లారెన్ ఫైలర్ తలో మూడు.. ఫ్రేయా కెంప్, జార్జియా డేవిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డే సెప్టెంబర్ 11న జరుగనుంది. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment