Australia Vs England: యాషెస్ సిరీస్ 2021-22లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను దురుదృష్టం వెంటాడుతుంది. వరుస ఇన్నింగ్స్‌ల్లో తొంబైల్లోకి చేరిన ఈ మాజీ ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు.. రెండుసార్లు సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. గబ్బాలో జరిగిన తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల వద్ద ఔటైన డేవిడ్ భాయ్.. ప్రస్తుతం అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సైతం తొంబైల్లోనే వెనుదిరిగాడు.
తొలి టెస్ట్‌లో గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగని వార్నర్.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ బౌలింగ్‌లో బ్రాడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా యాషెస్ చరిత్రలో గత వందేళ్లలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీకి చేరువగా వచ్చి తొంబైల్లో ఔట్ అయిన తొలి ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా అరుదైన రికార్డును సాధించాడు. వార్నర్‌కు ముందు 1921లో టామీ ఆండ్రూస్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో తొంబైల్లో ఔట్ అయ్యాడు.
కెరీర్‌లో గడిచిన 159 ఇన్నింగ్స్‌ల్లో 90 పరుగుల మార్కు దాటాక ఒక్కసారి మాత్రమే ఔటైన వార్నర్.. గత రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా తొంబైల్లోనే నిష్క్రమించడం విశేషం. వార్నర్ తన 88 టెస్ట్‌ల కెరీర్‌లో 24 సార్లు సెంచరీ మార్కును విజయవంతంగా అందుకున్నాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లబూషేన్ (95 నాటౌట్), తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ (18 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: అప్పట్లో సచిన్, ఇప్పుడు కోహ్లి.. ఇద్దరినీ ఒకేలా అవమానించారు..!
Comments
Please login to add a commentAdd a comment