
టిమ్ పెయిన్
అడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ విజయం ముంగిట నిలిచింది. 104/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు లంచ్ సమయానికి మరో రెండు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ట్రావిస్‌హెడ్ (14)ను ఇషాంత్ శర్మ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ టీమ్ పెయిన్‌తో షాన్ మార్ష్ ఆచితూచి ఆడాడు.
31 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన షాన్ మార్ష్ 146 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని బుమ్రా విడదీశాడు. మార్ష్(60:166 బంతుల్లో 5 ఫోర్లు)ను అద్భుత బంతితో పెవిలియన్ బాట పట్టించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కమిన్స్(5: 38 బంతులు)తో కెప్టెన్ పెయిన్(40: 68 బంతుల్లో 4 ఫోర్లు) పోరాడుతున్నాడు. భారత్ విజయానికి మరో నాలుగు వికెట్ల దూరంలో ఉండగా.. ఆసీస్ 137 పరుగులు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment