England 12- Member Squad: ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టు తాము ఆడిన ఎనిమిది డే అండ్ నైట్ టెస్టుల్లో గెలిచి అజేయంగా ఉంది. ఈ నేపథ్యంలో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో అడిలైడ్‌లో గురువారం మొదలయ్యే రెండో టెస్టులో ఆస్ట్రేలియా మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు ఇంగ్లండ్ రెండు మార్పులు చేసే అవకాశముంది. పేసర్లు అండర్సన్, బ్రాడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో వీరిద్దరు తుది జట్టులో ఆడటం ఖాయమైంది.
యాషెస్ సిరీస్ రెండో టెస్టుకు ఇంగ్లండ్ ప్రకటించిన జట్టు ఇదే:
జో రూట్(కెప్టెన్), జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్, డేవిడ్ మలన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ పోప్, రోరీ బర్న్స్, ఓలీ రాబిన్సన్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, హసీబ్ హమీద్, క్రిస్ వోక్స్.
చదవండి: యాషెస్ సిరీస్ 2021-22.. రెండో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ఇదే
Comments
Please login to add a commentAdd a comment