ఇంగ్లండ్ వెటరన్ పేసర్.. జేమ్స్ అండర్సన్ నిస్సందేహంగా ఈ తరంలో ఒక గొప్ప ఫాస్ట్ బౌలర్ అని చెప్పొచ్చు. స్వింగ్ కింగ్‌గా పేరొందిన అండర్సన్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టి ఇంగ్లండ్‌కు ఎన్నో విజయాలు అందించాడు. ఇరుదేశాలు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్‌లోనూ అండర్సన్ కీలకపాత్ర పోషించాడు.
2015లో ఇంగ్లండ్ యాషెస్ గెలవడంలో అండర్సన్‌దే ముఖ్యపాత్ర. అలాంటి అండర్సన్ బౌలింగ్‌లో పదును తగ్గినట్లు అనిపిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన యాషెస్ సిరీస్ 2023లో అండర్సన్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అయితే ఈ ఒక్క ప్రదర్శనతో అతనికి వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే బెన్ స్టోక్స్ అండర్సన్‌ను బాగా నమ్ముతాడు. అందుకే రెండో టెస్టులో రాణించి స్టోక్స్ నమ్మకాన్ని నిలబెట్టాలని అనుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు సిద్ధమవుతున్న అండర్సన్ ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై విమర్శలు గుప్పించాడు. ''లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో నా బౌలింగ్ పదును చూపించాలనుకుంటున్నా. కానీ ఎడ్జ్‌బాస్టన్ టెస్టు పిచ్ ఫ్లాట్‌గా ఉంది. యాషెస్ సిరీస్‌లో జరిగే మిగతా టెస్టుల్లోనూ పిచ్ ఇలాగే ఉంటే మాత్రం యాషెస్‌తో నా బంధం ముగిసినట్లే.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో పిచ్‌పై స్వింగ్, రివర్స్ సింగ్ లేవు.. సీమ్ బౌన్స్ అసలే లేదు.. కనీసం పేస్ బౌలింగ్‌కు కూడా అనుకూలంగా లేదు. రానున్న మ్యాచ్‌ల్లో పేస్‌కు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నా. ఇక ఎన్నో ఏళ్లుగా ఇంగ్లండ్‌కు ప్రధాన బౌలర్‌గా ఉన్నా. నా బౌలింగ్ స్కిల్స్‌తో ఎలాంటి కండీషన్స్‌లోనైనా వికెట్లు రాబట్టే ప్రయత్నం చేశా.. కానీ ఎడ్జ్‌బాస్టన్ పిచ్ మొదటిసారి కొత్తగా కనిపించింది. ఇలాగే ఉంటే యాషెస్‌తో నా బంధం ముగిసినట్లే(అంటే జట్టులో చోటు కోల్పోవడమే) అని అర్థం'' అంటూ వివరించాడు.
James Anderson said - "If all Ashes pitches are like Edgbaston that I'm done in the Ashes series. That pitch was like kryptonite for me. There was not much swing, no reverse swing, no seam bounce, no movement and no pace". (On Edgbaston pitch in first Ashes)#Ashes2023 pic.twitter.com/fqQBldgENj
— Aman Awasthi (@AwasiAman17) June 23, 2023
Comments
Please login to add a commentAdd a comment