అడిలైడ్ వేదికగా భారత్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ది కీలక పాత్ర. మరోసారి భారత్‌పై హెడ్ సత్తాచాటాడు. ఈ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
తన మెరుపు శతకంతో మ్యాచ్‌ను కంగారూల వైపు తిప్పాడు. భారత బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 111 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 141 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్.. 4 సిక్స్‌లు, 17 బౌండరీలతో 140 పరుగులు చేశాడు. తన అద్బుత ప్రదర్శనకు గాను హెడ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
ట్రావిస్ హెడ్ వరల్డ్ రికార్డు..
👉టీమిండియాపై పింక్, రెడ్, వైట్ బంతులతో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా హెడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరికి సాధ్యం కాలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్-2023లో భారత్‌పై తొలి రెడ్ బాల్ సెంచరీని హెడ్ నమోదు చేశాడు.
ఆ మ్యాచ్‌లో హెడ్ 163 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో(వైట్‌బాల్) భారత్‌పై హెడ్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. 137 పరుగులు చేసి తమ జట్టును ఆరోసారి వన్డే వరల్డ్‌కప్‌ను అందించాడు. ఇప్పుడు పింక్‌బాల్‌తో జరిగిన టెస్టులో కూడా తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే టీ20ల్లో మాత్రం భారత్‌పై హెడ్ సెంచరీ చేయలేదు.
👉అదే విధంగా డే అండ్ నైట్ టెస్ట్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన హెడ్.. తన రికార్డును తనే బద్దులు కొట్టాడు. 2022లో ఇంగ్లండ్‌తో హోబర్ట్ వేదికగా జరిగిన పింక్ బాల్ మ్యాచ్‌లో 112 బంతుల్లో శతకం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment