బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ పింక్‌బాల్ టెస్టులో గెలిచి తమ ఆధిక్యాన్ని పెంచుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. ఆసీస్ మాత్రం తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని తమ ఆస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. హేజిల్‌వుడ్ ప్రస్తుతం పక్కటెముకుల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆసీస్ జట్టు మేనెజ్‌మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చింది.
పెర్త్‌లో అదుర్స్..
కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికి.. హాజిల్ వుడ్ మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి టెస్టులో మొత్తంగా 5 వికెట్లు హాజిల్ వుడ్ పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ కావడంలో వుడ్‌ది కీలక పాత్ర.
అబాట్, డాగెట్‌లకు పిలుపు..
కాగా హాజిల్‌వుడ్ రీప్లేస్‌మెంట్స్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పేసర్లు సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్‌లకు జట్టులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరూ జట్టులోకి వచ్చినప్పటకి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం స్కాట్ బోలాండ్‌కే చోటు దక్కే అవకాశముంది. కాగా మొదటి టెస్టులో అతడు బెంచకే పరిమితమయ్యాడు.
చదవండి: SA vs SL 1st Test: స్టబ్స్, బవుమా సెంచరీలు.. గెలుపు దిశగా దక్షిణాఫ్రికా
Comments
Please login to add a commentAdd a comment