డే అండ్ నైట్ టెస్టుకు ఇంగ్లండ్ సిద్ధం! | England to Host Their First Day-Night Test Against West Indies | Sakshi
Sakshi News home page

డే అండ్ నైట్ టెస్టుకు ఇంగ్లండ్ సిద్ధం!

Published Fri, Oct 7 2016 1:29 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

డే అండ్ నైట్ టెస్టుకు ఇంగ్లండ్ సిద్ధం!

డే అండ్ నైట్ టెస్టుకు ఇంగ్లండ్ సిద్ధం!

పింక్ బాల్ తో నిర్వహించే డే అండ్ నైట్ టెస్టుకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లండ్ సిద్ధమైంది.

లండన్: పింక్ బాల్ తో నిర్వహించే డే అండ్ నైట్ టెస్టుకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లండ్ సిద్ధమైంది. వచ్చే ఏడాది ఆగస్టులో వెస్టిండీస్ తో జరిగే సిరీస్ లో పింక్ బాల్ టెస్టును నిర్వహించనున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెలిపింది. అసలు ఇంగ్లండ్ వాతావరణంలో పింక్ బాల్ తో డే అండ్ నైట్ సాధ్యం కాదనే వాదనకు ఈసీబీ ఫుల్ స్టాప్ పెట్టింది.

'2017 ఆగస్టులో విండీస్ తో జరిగే మూడు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టును డే అండ్ నైట్ గా నిర్వహించనున్నాం. ఈ తరహా మ్యాచ్ లతో టెస్టు క్రికెట్ కు మరింత లబ్ది చేకూరే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు ముందడుగు వేశాం.  డే మ్యాచ్ లను ఎలా నిర్వహించామో? అదే స్థాయిలో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ను నిర్వహిస్తాం' అని ఈసీబీ తెలిపింది. దాంతో  డే అండ్ నైట్ టెస్టుకు ఆతిథ్యమిచ్చే మూడో దేశంగా ఇంగ్లండ్ నిలవనుంది.  గతేడాది ఆస్ట్రేలియాలో ఆ దేశంతో న్యూజిలాండ్ ఒక పింక్ బాల్ మ్యాచ్ ను ఆడగా, వచ్చే వారం యూఏఈలో పాకిస్తాన్ -వెస్టిండీస్ ల ద్వైపాక్షిక సిరీస్ లో మరొక పింక్ బాల్ టెస్టు జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement