ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్ అందినట్లు తెలుస్తోంది. చేతి వేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తిరిగి ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం.
శుక్రవారం(నవంబర్ 29) మొదటిసారి గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒకవేళ ప్రాక్టీస్‌లో అతడికి ఎటువంటి సమస్యలు తలెత్తకపోతే సెకెండ్ టెస్టుకు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పింక్ బాల్ టెస్టుకు ముందు భారత జట్టు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా తొలి టెస్టుకు ముందు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బొటన వేలికి గాయమైంది. దీంతో ఆఖరి నిమిషంలో పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు.
అతడి స్ధానంలో దేవ్‌దత్త్ పడిక్కల్ తుది జట్టులోకి వచ్చాడు. కానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. మరోవైపు రెండో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అందుబాటులోకి వచ్చాడు.
వీరిద్దరూ జట్టులోకి వస్తే పడిక్కల్, ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు. ఇక ఈ రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా మొదలు కానుంది. కాగా తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియాతో టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ జడేజా, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్
చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment