
పింక్ బాల్ టెస్టులో తొలి సెంచరీ..
భారత్లో పింక్ బాల్తో నిర్వహిస్తున్న మొదటి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లో తొలి సెంచరీ నమోదైంది.
కోల్కతా: భారత్లో పింక్ బాల్తో నిర్వహిస్తున్న మొదటి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లో తొలి సెంచరీ నమోదైంది. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో భవానీపూర్ క్లబ్‌ల మధ్య జరుగుతున్న సూపర్ లీగ్ ఫైనల్లో మోహన్ బగాన్ ఆటగాడు ఆరిందమ్ ఘోష్ శతకంతో రాణించాడు. తద్వారా భారత్ లో పింక్ బాల్ టెస్టులో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మోహన్ బగాన్ రెండో ఇన్నింగ్స్లో ఘోష్ 125 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ మ్యాచ్లో ఘోష్ 225 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో శతకం చేయడంతో మోహన్ బగాన్ జట్టు 88.1 ఓవర్లలో 349 పరుగులు చేసింది. దీంతో 496 పరుగుల లక్ష్యాన్ని భవానీపూర్ జట్టుకు మోహన్ బగాన్ నిర్దేశించింది. ఇదిలా ఉండగా, మోహన్ బగాన్ బౌలర్ మొహ్మద్ షమీ ఐదు వికెట్లతో రాణించిన మరుసటి రోజే, అదే జట్టుకు చెందిన మరో ఆటగాడు సెంచరీ చేయడం విశేషం.