అహ్మదాబాద్: 6.2-3-8-5.. ఇవి ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ గణాంకాలు. సాధారణంగా ఇలాంటి స్పెల్ ఒక ప్రధాన బౌలర్ నుంచి చూస్తుంటాం. కానీ ఎవరు ఊహించని విధంగా టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో రూట్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొటేరా పిచ్ అనూహ్యంగా మారుతున్న వేళ తమ జట్టు ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్‌ను రూట్ మించిపోయాడు. డే నైట్ టెస్టులు సాధారణంగా పేసర్లకు స్వర్గధామంగా నిలిచాయి.. కానీ అనూహ్యంగా అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారింది.
దీంతో ఇంగ్లండ్‌కు లీచ్ మినహా మరో స్పిన్నర్ లేకపోవడంతో రూట్ తానే స్వయంగా రంగంలోకి దిగాడు. పంత్‌తో తన వికెట్ల వేటను ఆరంభించిన రూట్ చివరి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకోవడం విశేషం. బ్యాటింగ్‌లోనే అదరగొడుతానుకున్న రూట్ బౌలింగ్‌లోనూ ఈ విధంగా చెలరేగిపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. మొదటి టెస్టులో తన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన రూట్.. తాజాగా మూడో టెస్టులో తమ ప్రధాన బౌలర్ జాక్ లీచ్‌తో సమానంగా వికెట్లు తీసి టీమిండియా ఆలౌట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు.
కాగా మొదటి రోజు ఆటలో టీమిండియా ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఔట్‌ల విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో రూట్ వివాదానికి దిగిన సంగతి తెలిసిందే. మైదానంలో కెమెరా యాంగిల్స్ అన్ని పరిశీలించకుండానే నాటౌట్ ఎలా ఇస్తారంటూ రూట్ అసహనం వ్యక్తం చేశాడు. ఇదే విషయమై ఇంగ్లండ్ ప్రధాన కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌తో కలిసి రూట్ మ్యాచ రిఫరీ జగవల్ శ్రీనాథ్‌కు ఫిర్యాదు చేశాడు.
చదవండి: మూడో టెస్ట్ లైవ్ అప్‌డేట్స్: సూన్నాకే రెండు వికెట్లు
Comments
Please login to add a commentAdd a comment