
ముంబై: భారత మహిళా క్రికెట్ లో మరో ఘట్టానికి తెర లేవనుంది. మహిళల క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకు వేళ్లేందుకు బీసీసీఐ అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు తమ తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో మిథాలీ సేన పింక్ బాల్ టెస్ట్ ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ మ్యాచ్ జరగునుంది. ఈ విషయాన్ని భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
అయితే మహిళల క్రికెట్ చరిత్రలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే పింక్‌బాల్ టెస్టు రెండోది మాత్రమే. 2017లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.జూన్ 2న భారత పురుషులతో పాటు మహిళలు కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఏడేళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో మిథాలీ సేన టెస్టు మ్యాచ్ ఆడనుంది. జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
(చదవండి:ఇంగ్లండ్ వేదికగా ఐపీఎల్ ?)
Comments
Please login to add a commentAdd a comment