ఈ ఏడాది నవంబర్‌లో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుండటం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
చివరగా 1991-92లో ఆసీస్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరిగింది. కాగా ఇక ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఇరు జట్లు పింక్‌బాల్ టెస్టులో తలపడనున్నాయి. ఈ డే-నైట్ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో పింక్-బాల్ టెస్ట్‌కు ముందు రెండు రోజుల డే-నైట్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా షెడ్యూల్ చేసింది. మనుకా ఓవల్ వేదికగా ప్రైమ్ మినిస్టర్ XIతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
ఈ ప్రాక్టీస్ మ్యాచ్ భారత జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఎందుకంటే 2020-21 టూర్‌లో డే-నైట్ టెస్ట్‌లో భారత్ ఘోర పరాభావాన్ని ఎదుర్కొంది. ఇదే అడిలైడ్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే భారత్ ఆలౌటైంది.
దీంతో 8 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. ఇక ఆసీస్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్‌నే పింక్ బాల్ టెస్టుగా షెడ్యూల్ చేశారు. మొత్తం ఈ ఐదు టెస్టులు పెర్త్, ఆడిలైడ్, బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీ వేదికలగా జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment