Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు వచ్చి పడింది. పింక్ బాల్‌తో ఆడే డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో (ఒకే టెస్ట్) 50కి పైగా పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అయ్యర్ తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. అయ్యర్‌కు ముందు ఈ ఘనతను డారెన్ బ్రావో (87, 116) 2016లో పాక్‌పై, స్టీవ్ స్మిత్ (130, 63) 2016లో పాక్‌పై, మార్నస్ లబూషేన్ రెండు సందర్భాల్లో (2019లో న్యూజిలాండ్‌పై 143, 50.. 2021లో ఇంగ్లండ్‌పై 103, 51) సాధించారు.
కాగా, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. 64 ఓవర్లు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి ఓవరాల్‌గా 414 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపును ఆపడం దాదాపుగా అసాధ్యం. తొలి రోజు ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇదే స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి 109 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా (5/24) ఐదేయగా, అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించారు.
చదవండి: టెస్ట్‌ల్లో రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. 40 ఏళ్ల కపిల్ రికార్డు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment