Bengaluru test
-
IND VS SL: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి
భారత్-శ్రీలంక జట్ల మధ్య ఇటీవలే బెంగుళూరులో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ (పింక్ బాల్ టెస్ట్)పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ కోసం వినియోగించిన పిచ్‌పై ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ పెదవి విరిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్‌కు బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. చర్యల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంకు ఓ డీమెరిట్ పాయింట్ ఇచ్చాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఓ వేదిక 5 డీమెరిట్ పాయింట్లు పొందితే, సంవత్సరం పాటు అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించకుండా నిషేధిస్తారు. కాగా, రిఫరీ జవగల్ శ్రీనాథ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సొంత మైదానం కావడం విశేషం. ఇదిలా ఉంటే, పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా 3 రోజుల్లోనే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి రోజు నుంచే విపరీతంగా టర్న్ అవుతూ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టింది. తొలి రోజు ఆటలో రికార్డు స్థాయిలో 16 వికెట్లు పతనమయ్యాయి. అయితే, భారత బ్యాటర్లు, ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలతో టీమిండియాకు 238 పరుగుల భారీ విజయాన్నందించాడు. లంక రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కరుణరత్నే సూపర్ శతకంతో చెలరేగినప్పటికీ, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఇరు జట్లలోని స్పిన్నర్లు ఏకంగా 26 వికెట్లు పడగొట్టగా, టీమిండియా పేసు గుర్రం బుమ్రా నిర్జీవమైన పిచ్‌పై 8 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు) చెలరేగాడు. చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W — BCCI (@BCCI) March 14, 2022 -
చరిత్ర సృష్టించిన రోహిత్.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు
Rohit Sharma: శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా అరంగేట్రం సిరీస్‌ల్లోనే (మూడు ఫార్మాట్లు) క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి సారథిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.కోహ్లి నుంచి ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వన్డే (3-0), టీ20 సిరీస్ (3-0)ల్లో వైట్‌వాష్ చేసిన రోహిత్.. తాజాగా శ్రీలంకను టెస్ట్ సిరీస్‌లో 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. Rohit Sharma Created History As Captain Only Captain in the History Of Cricket to have Won his First Series in all three formats by Cleansweep as full Time Captain. Well done, Captain Ro. pic.twitter.com/App7UuFLLw — CricketMAN2 (@ImTanujSingh) March 14, 2022 కాగా, బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి టెస్ట్‌లోనూ లంకపై భారీ విజయం (ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో) సాధించిన రోహిత్ సేన.. టెస్ట్ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. ఈ భారత పర్యటనలో శ్రీలంక ఒక్క మ్యాచ్ కూడా గెలుపొందలేక రిక్త హస్తాలతో స్వదేశానికి తిరుగు పయనమైంది. రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధసెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ ఆధ్యంతం రాణించిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించింది. Since @ImRo45 became full time Captain: 3-0 vs NZ (T20I) 3-0 vs WI (ODI) 3-0 vs WI (T20I) 3-0 vs SL (T20I) 2-0 vs SL (Tests) #INDvSL pic.twitter.com/ojREzqlA6M — Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2022 CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W — BCCI (@BCCI) March 14, 2022 Rohit Sharma as Indian Captain 1st ODI Series - Won 1st T20I Series - Won 1st Test Series - Won*#INDvSL — CricBeat (@Cric_beat) March 14, 2022 రెండో టెస్ట్ సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్ : 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92, జయవిక్రమ 3/81) శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24) భారత్ రెండో ఇన్నింగ్స్ : 303/9 డిక్లేర్ ( శ్రేయస్ అయ్యర్ 67, జయవిక్రమ 4/78) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 208 (కరుణరత్నే 107, అశ్విన్ 4/55) చదవండి: టెస్ట్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా..! Spirit of Cricket at its best as #TeamIndia congratulate Suranga Lakmal who played his last international match 🤜🤛 #SpiritOfCricket | #INDvSL | @Paytm pic.twitter.com/aa17CK5hqv — BCCI (@BCCI) March 14, 2022 -
శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు
Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు వచ్చి పడింది. పింక్ బాల్‌తో ఆడే డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో (ఒకే టెస్ట్) 50కి పైగా పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అయ్యర్ తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. అయ్యర్‌కు ముందు ఈ ఘనతను డారెన్ బ్రావో (87, 116) 2016లో పాక్‌పై, స్టీవ్ స్మిత్ (130, 63) 2016లో పాక్‌పై, మార్నస్ లబూషేన్ రెండు సందర్భాల్లో (2019లో న్యూజిలాండ్‌పై 143, 50.. 2021లో ఇంగ్లండ్‌పై 103, 51) సాధించారు. కాగా, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. 64 ఓవర్లు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి ఓవరాల్‌గా 414 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపును ఆపడం దాదాపుగా అసాధ్యం. తొలి రోజు ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇదే స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి 109 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా (5/24) ఐదేయగా, అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించారు. చదవండి: టెస్ట్‌ల్లో రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. 40 ఏళ్ల కపిల్ రికార్డు బ్రేక్ -
టెస్ట్‌ల్లో రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. 40 ఏళ్ల కపిల్ రికార్డు బ్రేక్
Rishabh Pant Scores Fastest 50 For India In Test Cricket: టీమిండియా వికెట్‌కీపర్ రిషభ్ పంత్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పంత్ కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ (1982లో పాక్‌పై 30 బంతుల్లో) పేరిట ఉండేది. తాజాగా పంత్ కపిల్ రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ కూడా పంత్ తరహాలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ 31 బంతుల్లో ఫిఫ్టి బాదాడు. ఇక 2008లో సెహ్వాగ్ ఇంగ్లండ్‌పై 32 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. 47 ఓవర్లు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ఓవరాల్‌గా 342 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపును ఆపడం దాదాపుగా అసాధ్యం. తొలి రోజు ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇదే స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి 109 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా (5/24) ఐదేయగా, అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించారు. చదవండి: IND VS SL 2nd Test Day 2: ఐదేసిన బుమ్రా.. కుప్పకూలిన శ్రీలంక -
IND VS SL 2nd Test Day 2: ఐదేసిన బుమ్రా.. కుప్పకూలిన శ్రీలంక
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (పింక్ బాల్ టెస్ట్) శ్రీలంక జట్టు ఓటమి దిశగా సాగుతుంది. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (5/24) ఐదేయడంతో లంకేయులు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలారు. ఓవర్ నైట్ స్కోరు 86/6 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదంటే ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. బుమ్రాకు జతగా అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించడంతో లంక తొలి రోజు స్కోర్‌కు మరో 23 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లు కోల్పోయింది. ఫలితంగా టీమిండియాకు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కెరీర్లో 29వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బుమ్రా 8వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, లంక ఇన్నింగ్స్‌లో ఏంజలో మాథ్యూస్ (43), డిక్వెల్లా (21), ధనంజయ డిసిల్వా (10)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే మయాంక్ అగర్వాల్ (22) వికెట్‌ను కోల్పోయింది. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసి, ఓవరాల్‌గా 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రోహిత్ శర్మ (20), హనుమ విహారి క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: ప్రేక్షకుడి ముక్కు పగలగొట్టిన రోహిత్ శర్మ.. ఆస్పత్రిలో చేరిక! -
పింక్ బాల్ టెస్ట్‌ల్లో సరికొత్త రికార్డు.. తొలి రోజు ఏకంగా..!
India vs Sri Lanka, pink-ball Test Day 1 highlights: పింక్ బాల్‌తో జరిగే డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఫార్మాట్లో బెంగళూరు వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటలో ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌ల చరిత్రలో తొలి రోజే ఇన్ని వికెట్లు కూలడం ఇదే ప్రధమం. 2017లో సౌతాఫ్రికా, జింబాబ్వేల మధ్య మ్యాచ్‌లో 13 వికెట్లు, 2018లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌లో 13, 2019లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో 13, 2021 భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లో 13 వికెట్లు తొలి రోజే పడ్డాయి. ఈ ఐదు సందర్భాల్లో మూడింటిలో టీమిండియా భాగం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (92) ఒంటరి పోరాటం చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ తలో 3 వికెట్లు, ధనంజయ డిసిల్వా 2, సురంగ లక్మల్ ఓ వికెట్ పడగొట్టారు. మయాంక్ అగర్వాల్ రనౌటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక భారత బౌలర్లు బుమ్రా (3/15), షమీ (2/ 18), అక్షర్ పటేల్ (1/21)ల ధాటికి విలవిలలాడింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఏంజలో మాథ్యూస్ ధాటిగా ఆడి 43 పరుగులు చేయడంతో లంక జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. చదవండి: మాతృదేశంపై సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ అరుదైన ఘనత -
శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం.. మరో 8 పరుగులు చేసుంటే..!
మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (92, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 252 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా, శ్రేయస్ ఏమ్రాతం తగ్గకుండా దూకుడుగా ఆడుతూ 54 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తొలి రోజు నుంచే బౌలర్లకు అనుకూలంగా మరిపోయిన పిచ్‌పై శ్రేయస్ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. టెయిలెండర్లు క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడుతుండగా 11వ నంబర్ ఆటగాడు బుమ్రా (0) సహకారంతో ఫోర్లు, సిక్సర్లతో ఎదురుదాడికి దిగాడు. మరో 8 పరుగులు చేస్తే కెరీర్లో రెండో సెంచరీ చేస్తాడనుకున్న సమయంలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన శ్రేయస్ స్టంపవుటయ్యాడు. దీంతో 252 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. కెరీర్లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ (15)తో పాటు 101 టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి (23), ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) మరోసారి నిరాశపరిచారు. హనుమ విహారి (31), రిషబ్ పంత్ (26 బంతుల్లో 39; 7 ఫోర్లు) పర్వాలేదనిపించగా, తొలి టెస్ట్ హీరో రవీంద్ర జడేజా (4), అశ్విన్ (13), అక్షర్ (9), షమీ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో బుమ్రా సహకారంతో శ్రేయస్ ఆపద్భాందవుని ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ తలో 3 వికెట్లు, ధనంజయ డిసిల్వా 2, సురంగ లక్మల్ ఓ వికెట్ పడగొట్టారు. మయాంక్ అగర్వాల్ రనౌటయ్యాడు. చదవండి: అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత! -
బీసీసీఐ ద్వంద్వ వైఖరి.. కోహ్లి విషయంలో అలా, రోహిత్ కోసం ఇలా..!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రస్తుత సారధి రోహిత్ శర్మల విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ద్వంద్వ వైఖరి అవళంభిస్తుందని కోహ్లి ఫ్యాన్స్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కోహ్లి తన కెరీర్లో మైలురాయి టెస్ట్ అయిన 100వ టెస్ట్‌ను తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్న బెంగళూరులో ఆడాలని ఆశించాడు. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తుందని భావించాడు. అయితే ఈ విషయంలో కోహ్లి ఉద్దేశాలను అంతాగా పట్టించుకోని బీసీసీఐ.. ఆ మ్యాచ్‌ను షెడ్యూల్ ప్రకారం యధాతథంగా మొహాలీలోనే కొనసాగించి కోహ్లితో పాటు అతని ఫ్యాన్స్‌ను దారుణంగా నిరుత్సాహపరిచింది. తొలుత ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని భావించినప్పటికీ.. చివరి నిమిషంలో కోహ్లి అభిమానుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో 50 శాతం ప్రేక్షకులకు అనుమతించింది. కోహ్లి కెరీర్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఈ టెస్ట్ విషయంలో ఏ మాత్రం కనికరం చూపని బీసీసీఐ.. ప్రస్తుత టీమిండియా సారధి రోహిత్ శర్మ విషయంలో మాత్రం ప్రత్యేక ఆసక్తిని కనబర్చి, కోహ్లి ఫ్యాన్స్ నుంచి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో రేపటి (మార్చి 12) నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్, రోహిత్ కెరీర్లో 400వ మ్యాచ్ కానుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావించి, ముందుగా అనుకున్న కొన్ని నిబంధనలను సవరించి, బెంగళూరు టెస్ట్‌కు 100 శాతం ప్రేక్షకులకు అనుమతిస్తూ ప్రకటన జారీ చేసింది. ఇదే కోహ్లి ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. తమ ఆరాధ్య క్రికెటర్ మైలురాయి టెస్ట్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోగా, 50 శాతం ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోని అనుమతించిన బీసీసీఐ.. రోహిత్ 400వ మ్యాచ్‌ను హైలైట్ (డే అండ్ నైట్, పింక్ బాల్ మ్యాచ్) చేస్తూ 100 శాతం ప్రేక్షకులను అనుమతించడమేంటని మండిపడుతున్నారు. కోహ్లి విషయంలో కోవిడ్ నిబంధనల పేర్లు చెప్పి తప్పించుకున్న బీసీసీఐకి ఇప్పుడు ఆ నిబంధనలు పట్టవా అని ఫైరవుతున్నారు. బీసీసీఐ కంకణం కట్టుకుని మరీ కోహ్లిని అవమానించాలని చూస్తే మాత్రం ఊరుకోమని సోషల్‌మీడియా వేదికగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. చదవండి: Ind Vs Sl 2nd Test: రోహిత్ శర్మపై దారుణమైన ట్రోల్స్.. చమీర‘సన్’ అంటూ -
విరాట్ కోహ్లికి పొంచి ఉన్న పెను ప్రమాదం.. మరో 43 పరుగులు చేయకపోతే..?
ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చ లేక సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి సంబంధించి ఓ అరుదైన రికార్డు ప్రమాదంలో పడింది. బెంగళూరు వేదికగా ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌లో (శ్రీలంకతో) విరాట్ మరో 43 పరుగులు చేయకపోతే టెస్ట్‌ల్లో ఆరేళ్ల తర్వాత తొలిసారిగా 50 సగటు మార్కును కోల్పోతాడు. 23rd November 2019: Virat Kohli’s 70th century. The last time he scored a ton. It’s been two years and counting… pic.twitter.com/ZwOf4Qiwrp — Prajakta (@18prajakta) November 23, 2021 ప్రస్తుతం కోహ్లి అన్ని ఫార్మాట్లలో 50కిపైగా సగటుతో(కనీసం 90 మ్యాచ్‌ల్లో) కొనసాగుతూ, ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంకతో జరగబోయే రెండో టెస్ట్‌లో ఇదే రికార్డుకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కును అందుకోలేక ఇబ్బంది పడుతున్న కోహ్లి ఈ రికార్డును కూడా కోల్పోతే మరింత ఒత్తిడిని ఎదుర్కొంటాడని విశ్లేషకులతో పాటు అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కోహ్లి 100 టెస్ట్‌ల్లో 50.35, 260 వన్డేల్లో 58.07, 97 టీ20ల్లో 51.50 సగటుతో కొనసాగుతున్నాడు. కోహ్లి తన 52వ టెస్ట్‌లో(ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో) తొలిసారిగా సుదీర్ఘ ఫార్మాట్లో 50 సగటును అందుకున్నాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 235 పరుగులు చేశాడు. ఇక టెస్ట్ ఫార్మాట్లో అతని అత్యుత్తమ సగటు 2019లో పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో కోహ్లి 254పరుగులు చేయడంతో అతని యావరేజ్ 55.10కు చేరింది. నాటి నుంచి అది తగ్గుతూ వస్తూ ప్రస్తుతం 50 దిగువకు పడిపోయే ప్రమాదంలో పడింది. కోహ్లి చివరిసారిగా 2019లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో సెంచరీ (70వ శతకం) చేశాడు. ఆ టెస్ట్ తర్వాత 28 నెలల కాలంలో కోహ్లి తానాడిన 29 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 28.75 సగటుతో పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో కోహ్లి కేవలం 45 పరుగులు మాత్రమే చేసి అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. చదవండి: మటన్ రోల్స్ తినేందుకు వెళ్లి చిక్కుల్లో పడిన విరాట్ కోహ్లి..! -
IND VS SL 2nd Test: టీమిండియా కెప్టెన్ ఖాతాలో చేరనున్న మరో అరుదైన రికార్డు
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరబోతుంది. మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌తో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో 400 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించనున్న 35వ అంతర్జాతీయ క్రికెటర్‌గా, 9వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లతో టాప్‌లో ఉండగా, లంక మాజీ ప్లేయర్లు మహేల జయవర్థనే (652), సంగక్కర (594), జయసూర్య (586) వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో ఉన్నారు. భారత్ తరఫున సచిన్ తర్వాత ధోని (538), రాహుల్ ద్రవిడ్ (509), విరాట్ కోహ్లి (457), మహ్మద్ అజహారుద్దీన్ (433), సౌరవ్ గంగూలీ (424), అనిల్ కుంబ్లే (403), యువరాజ్ సింగ్ (402) రోహిత్ (399) కంటే ముందున్నారు. 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హిట్‌మ్యాన్.. తన 15 ఏళ్ల కెరీర్లో 44 టెస్ట్ మ్యాచ్‌లు, 230 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. ఈ క్రమంలో 41 సెంచరీలు, 84 హాఫ్ సెంచరీల సాయంతో 15672 పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగే రోహిత్.. ఈ ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లు (125), అత్యధిక పరుగులు (3313) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. చదవండి: Rohit Sharma: కలలో కూడా ఊహించలేదు: రోహిత్ శర్మ భావోద్వేగం -
కోహ్లి 100వ టెస్ట్ ప్రేక్షకులు లేకుండానే, ఆ మరుసటి మ్యాచ్‌కు మాత్రం..!
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ (మార్చి 4 నుంచి 8 వరకు) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. కోహ్లి కెరీర్లో మైలురాయిగా నిలిచే ఈ మ్యాచ్‌ను స్టేడియంలో వీక్షించేందుకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అనుమతించలేదు. కెప్టెన్సీ విషయంలో కోహ్లితో నెలకొన్న వివాదాల కారణంగా బీసీసీఐ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని కోహ్లి అభిమానులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన ఓ వార్త కోహ్లి అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అంగీకరించింది. ఈ విషయాన్ని కేసీఏ కార్యదర్శి సంతోష్ మీనన్ ధృవీకరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని ఆయన ప్రకటించారు. మార్చి 12 నుంచి 16 వరకు జరగనున్న బెంగళూరు టెస్టు.. డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరగనున్న విషయం తెలిసిందే. చదవండి: విరాట్ కోహ్లి 100వ టెస్ట్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్! -
Virat Kohli 100th Test: పుండుపై కారం చల్లినట్లు ఆ టెస్ట్ మ్యాచ్ కాకుండా..!
Srilanka Tour Of India 2022: భారత్-శ్రీలంక జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న టీ20, టెస్ట్ సిరీస్‌లకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. శ్రీలంక ఈ పర్యటనలో ముందుగా ప్రకటించిన విధంగా తొలుత టెస్ట్ సిరీస్ కాకుండా టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఫిబ్రవరి 24న లక్నోలో, రెండు, మూడో టీ20లు 26, 27 తేదీల్లో ధర్మశాలలో జరగనున్నాయి. అనంతరం తొలి టెస్ట్ మార్చి 4 నుంచి మొహాలీ వేదికగా, రెండో టెస్ట్ మార్చి 12 నుంచి బెంగళూరులో జరగనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. బెంగళూరు వేదికగా జరిగబోయే టెస్ట్ మ్యాచ్‌ను డే అండ్ నైట్ టెస్ట్(పింక్ బాల్)గా నిర్వహించబోతున్నట్టు బీసీసీఐ అధికారికంగా ఖరారు చేసింది. ఇదిలా ఉంటే, కోహ్లి వందో టెస్ట్(శ్రీలంకతో తొలి టెస్ట్) విషయంలో బీసీసీఐ బాస్ గంగూలీ కొద్ది రోజుల ముందు ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేసైనా కోహ్లి మైలురాయి టెస్ట్‌ని, అతనికి ప్రత్యేక అనుబంధం ఉన్న బెంగళూరులో(ఐపీఎల్) నిర్వహిస్తామని, అందులోనూ అది డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్ట్‌గా ఉంటుందని ప్రకటించాడు. అయితే, బీసీసీఐ తాజాగా వేదికల మార్పు అంశాన్ని పక్కన పెట్టి.. కోహ్లి కెరీర్లో అరుదైన మైలురాయిగా నిలిచే 100వ టెస్ట్ మ్యాచ్‌ని బెంగళూరు నగరంలో కాకుండా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మొహాలిలో నిర్వహించేందుకు సిద్దమైంది . ఇది విరాట్ కోహ్లితో పాటు ఆర్సీబీ అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లుగా అనిపిస్తుంది. షెడ్యూల్ మార్పు విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు అభ్యర్ధనను మన్నించి, ముందుగా టీ20 సిరీస్‌కు అనుమితిచ్చిన బీసీసీఐ, కోహ్లికి చిరకాలం గుర్తుండిపోయే టెస్ట్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా కొనసాగించడాన్ని కోహ్లి సహా ఆర్సీబీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, కెరీర్లో ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన కోహ్లికి ఐపీఎల్ కారణంగా బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌తో కలుపుకుని మొత్తం 15 సీజన్ల పాటు అతను నిరాటంకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కే ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ చరిత్రలో మరే ఇతర ఆటగాడు కోహ్లిలా ఒకే జట్టుకు ఆడింది లేదు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రోహిత్ సారధ్యంలోని టీమిండియా.. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా జరిగిన వన్డే సిరీస్‌ను రోహిత్ సేన..3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి(ఫిబ్రవరి 16) నుంచి ప్రారంభం కానుంది. చదవండి IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్ -
టీమిండియా గెలుపు వెనుక కీలక కారణాలివే!
బెంగళూరు టెస్టు దాదాపు థ్రిల్లర్ మూవీని తలపించింది. మొదట బ్యాటింగ్‌లో చిత్తయి.. ఆ తర్వాత బౌలింగ్‌లో అంతంతమాత్రం రాణించి.. రెండో టెస్టులో చాలావరకు ఆత్మరక్షణలో ఆడిన కోహ్లి సేన నాలుగో రోజు జూలు విదిల్చింది. ఎవరూ ఊహించనిరీతిలో అందరిని విస్మయపరుస్తూ ఆస్ట్రేలియాపై 75పరుగుల సంచలన విజయాన్ని నమోదుచేసింది. ఈ విజయంతో కోహ్లి సేనలో ఆత్మవిశ్వాసం ఇనుమడించడమే కాదు.. సిరీస్ 1-1తో సమం అయింది. నిజానికి నాలుగో రోజు టీమిండియాకు ప్రారంభంలో కొంత నిరాశే ఎదురైంది. మూడో రోజు 126 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి సేన భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందు ఉంచాలనుకుంది. కానీ కేవలం 61 పరుగులు మాత్రమే జోడించి చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో 188 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని నిలబెట్టుకోవాలంటే.. అసామాన్య ప్రతిభను చూపించాల్సిన తరుణంలో కోహ్లి సేన అదే చేసి చూపెట్టింది. బౌలింగ్ విభాగం వీరోచితమైన ప్రతిభను ప్రదర్శించింది. సమిష్టి కృషితో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు వెనుక కీలక కారణాలను విశ్లేషించుకుంటే.. ముందుండి నడిపించిన ఇషాంత్! 188 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఆరంభంలోనే ఓపెనర్లను వీడదీయాలి. ఒత్తిడి పెంచాలి. ఓపెనర్లు శుభారంభం ఇవ్వకుండా అడ్డుకోవాలి. సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ అదే చేశాడు. పెద్దగా పోరాటపటిమ చూపకుండా నిరాశ పరుస్తూ వచ్చిన ఇషాంత్ మంగళవారం మాత్రం సత్తా చాటాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లు కుదురుకోకముందే పెమిలియన్ దారి పట్టించాడు. ముఖ్యంగా కీలకమైన మాత్ రెన్షా వికెట్‌ను ఇషాంత్ పడగొట్టాడు. ప్రస్తుత సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలు సాధించి.. ఆసిస్ జట్టుకు మంచి ఓపెనింగ్స్‌ను ఇస్తున్న రెన్షాను త్వరగా ఔట్ చేయడం టీమిండియాకు కలిసి వచ్చింది. ఫీల్డర్లు తడబడలేదు! క్లోజ్ ఇన్ లో ఉన్న భారత ఫీల్డర్లు దారుణంగా క్యాచ్‌లు వదిలేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా పుణె టెస్టులో అయితే టీమిండియా లెక్కలెనన్ని క్యాచ్‌లు వదిలేసింది. దీంతో ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు మూడుసార్లు లైఫ్‌లైన్ లభించింది. దీంతో అతడు చెలరేగిపోయి.. భారత్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచడంలో సఫలమయ్యాడు. కానీ, బెంగళూరు టెస్టులో మాత్రం అందుకు టీమిండియా ఫీల్డర్లు తావు ఇవ్వలేదు. చక్కగా ఫీల్డింగ్ చేశారు. క్యాచ్‌లు అందుకున్నారు. అశ్విన్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ బ్యాటుకు తాకిన బంతిని ఇన్సైడ్ ఎడ్జ్ళో అందుకునేందుకు వృద్ధిమాన్ సాహా వేసిన డైవింగ్.. మ్యాచ్‌లో మనవారి ఫీల్డింగ్ ప్రతిభకు మచ్చుతునకగా చెప్పవచ్చు. వారెవ్వా అశ్విన్! ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అశ్విన్ పెద్దగా రాణించలేదు. ఆస్ట్రేలియా బ్యాట్‌మెన్‌ను అవుట్ చేయడంలో తంటాలు పడ్డాడు. బెంగళూరులో సెకండ్ ఇన్నింగ్స్ వరకు అతని మ్యాజిక్ పెద్దగా పనిచేయలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఐసీసీ నెంబర్ 1 టెస్టు బౌలర్ తన సత్తా ఏమిటో చాటాడు. అవసరమైన సమయంలో అద్భుతంగా పుంజుకొని ఆసిస్ జట్టు ఆరు వికెట్లు నేలకూల్చాడు. దీంతో భారత్‌కు 75 పరుగుల భారీ విజయం సొంతమైంది. -
వాటే మ్యాచ్.. శెభాష్ టీమిండియా!
బెంగళూరు: నగరంలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదుచేసింది. కేవలం 188 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థి ముందు ఉంచిన కోహ్లి సేన 75 పరుగుల తేడాతో రెండో టెస్టును సొంతం చేసుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నాలుగో రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించి.. హీరోగా నిలిచాడు. అతను ఏకంగా ఆరుగురు కంగారు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. అతనికి సహచర బౌలర్లు అండగా నిలిచారు. జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా మారిన అశ్విన్‌కు 5 వికెట్లకుపైగా తీసుకోవడం ఇది 25వ సారి. అంతేకాదు భారత గడ్డపై 200 వికెట్‌ను కూడా అతను ఇదే మ్యాచ్‌లో సొంతం చేసుకున్నాడు. కంగారు జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, పీటర్ హ్యాండ్స్కంబ్ తదితరులు బ్యాటింగ్ లైనప్‌ను నిలబెట్టేందుకు ప్రయత్రించినా.. గింగిరాలు తిరుగుతున్న బంతి ముందు నిలదొక్కుకోలేకపోయారు. విశేషమేమిటంటే చివరి ఆరు వికెట్లు 11 పరుగుల తేడాతో కుప్పకూలాయి. మొదటి టెస్టులో దారుణ పరాభవాన్ని ఎదుర్కొని.. రెండో టెస్టులో మొదట కొంత తడబడి.. ఆ తర్వాత పుంజుకొని అద్భుత విజయాన్ని నమోదుచేసిన కోహ్లిసేనపై ట్విట్టర్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. 'చెక్ దే ఇండియా' అంటూ సీనియర్ క్రికెటర్లు, ప్రముఖులు టీమిండియాకు ప్రశంసలు అందజేశారు. సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, మహమ్మద్ కైఫ్ తదితరులు కోహ్లి సేనను అభినందనలతో ముంచెత్తారు. Chak de India!! #INDvAUS pic.twitter.com/XjIyzVKvEh — sachin tendulkar (@sachin_rt) 7 March 2017 WHAT A MATCH ! Kohli will remember this for a long time, as will everyone who witnessed this.#IndvAus — Mohammad Kaif (@MohammadKaif) 7 March 2017 Shaabaas India. — Virender Sehwag (@virendersehwag) 7 March 2017 Congrats Team India on a fabulous,scintillating win -
ఇంతకూ కోహ్లి ఔటా? నాటౌటా?
ప్రస్తుతం కొనసాగుతున్న భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అదృష్టం ఏమాత్రం కలిసిరావడం లేదు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టు మూడోరోజు కూడా కోహ్లి ఔట్ కొంత సందేహాస్పదంగానే ఉంది. హజెల్‌వుడ్ విసిరిన బంతి కోహ్లి ప్యాడ్‌ను ఢీకొట్టింది. మరో ఆలోచన లేకుండా ఫీల్డ్ ఎంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్ ప్రకటించాడు. దీంతో కోహ్లి ఆవేశంగా డీఆర్ఎస్ సమీక్షకు వెళ్లాడు. ఎప్పటిలాగే డీఆర్ఎస్ కూడా ఈసారి కోహ్లికి దురదృష్టాన్ని మిగిల్చింది. వాస్తవానికి బంతి ప్యాడ్‌కు తాకినప్పటికీ.. డీఆర్ఎస్ సమీక్షలో రెండో శబ్దం కూడా వినిపించింది. దీంతో మొదట బంతి బ్యాట్‌ను తాకి.. తర్వాత ప్యాడ్‌ను తాకిందేమోనన్న అనుమానం తలెత్తింది. అయితే, బంతి మొదట ప్యాడ్ తాకిందా? లేక బ్యాటును తాకిందా? అన్నది థర్డ్ ఎంపైర్‌కు సవాలుగా మారింది. వీలున్న అన్ని మార్గాల్లోనూ బంతి గమనాన్ని సమీక్షించిన థర్డ్ ఎంపైర్ చివరకు కోహ్లి ఔట్‌గానే తేల్చాడు. తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో కోహ్లి మైదానాన్ని వీడాడు. ఇక, బీసీసీఐకి కూడా ఇదే డౌట్ వచ్చింది? కోహ్లి ఔటా? నాటౌటా? ఎంఫైర్ ఔట్ ఇచ్చాడు. మరి మీరేమంటారు' అంటూ క్రికెట్ అభిమానులకే చాయిస్ ఇస్తూ ట్వీట్ చేసింది. OUT or NOT OUT ? Richard Kettleborough thought it was out. What do you think ? #Virat @Paytm #INDvAUS pic.twitter.com/ytG40lfuwt — BCCI (@BCCI) March 6, 2017 -
పుణేలో ఓకీఫ్.. బెంగళూరులో లియాన్!
బెంగళూరు: బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో టీమిండియాను బ్యాటింగ్ వైఫల్యాలు వెంటాడుతున్నాయి. పుణే టెస్టు తరహాలోనే విరాట్ కోహ్లీ సేన బెంగళూరులో నేడు ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట నిలిపివేసే సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. వివాదాస్పద పుణే టెస్టులో ఆసీస్ లెఫ్టార్ట్ స్పిన్నర్ ఓకీఫ్ టీమిండియా వెన్ను విరచగా, బెంగళూరు టెస్టులో ఆ పనిని మరో స్పిన్నర్ నాథన్ లియాన్ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ స్టార్క్ ఓపెనర్ ముకుంద్ ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత పుజారా(17) తో కలిసి కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ(205 బంతుల్లో 90, 9 ఫోర్లు) చేసి ఇన్నింగ్స్ ను సరిదిద్దాడు. లంచ్ కు ముందు లియాన్ పుజారాను ఔట్ చేశాడు. ఆ తర్వాత వరుస విరామాలలో కోహ్లీ(12), రహానే(17), అశ్విన్(7), వృద్ధిమాన్ సాహా(1), జడేజా(3), రాహుల్(90), ఇషాంత్ శర్మ(0) లను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో భారత్ 189 పరుగులకే ఆలౌటయింది. లియాన్(8/50) తో చెలరేగడంతో కోహ్లీ సేన చివరి ఐదు వికెట్లను 15 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. రాహుల్ ఆదుకోకపోతే పుణే తొలి ఇన్నింగ్స్ లా పరిస్థితి తయారయ్యేది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రలియా ఎలాంటి తనబాటు లేకుండా బ్యాటింగ్ చేసింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(51 బంతుల్లో 23 నాటౌట్), రెన్ షా(47 బంతుల్లో 15 నాటౌట్) జాగ్రత్తగా ఆడటంతో ఆ జట్టు 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.