బీసీసీఐ ద్వంద్వ వైఖరి.. కోహ్లి విషయంలో అలా, రోహిత్ కోసం ఇలా..! | IND VS SL 2nd Test: BCCI Showing Dual Attitude In Virat Kohli And Rohit Sharma Case | Sakshi
Sakshi News home page

IND VS SL 2nd Test: రోహిత్‌ శర్మ 400వ మ్యాచ్‌కు 100 శాతం ప్రేక్షకులకు అనుమతి

Published Fri, Mar 11 2022 3:51 PM | Last Updated on Fri, Mar 11 2022 7:28 PM

IND VS SL 2nd Test: BCCI Showing Dual Attitude In Virat Kohli And Rohit Sharma Case - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లి, ప్రస్తుత సారధి రోహిత్‌ శర్మల విషయంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) ద్వంద్వ వైఖరి అవళంభిస్తుందని కోహ్లి ఫ్యాన్స్‌ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కోహ్లి తన కెరీర్‌లో మైలురాయి టెస్ట్‌ అయిన 100వ టెస్ట్‌ను తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్న బెంగళూరులో ఆడాలని ఆశించాడు. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తుందని భావించాడు. అయితే ఈ విషయంలో కోహ్లి ఉద్దేశాలను అంతాగా పట్టించుకోని బీసీసీఐ.. ఆ మ్యాచ్‌ను షెడ్యూల్‌ ప్రకారం యధాతథంగా మొహాలీలోనే కొనసాగించి కోహ్లితో పాటు అతని ఫ్యాన్స్‌ను దారుణంగా నిరుత్సాహపరిచింది. 

తొలుత ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని భావించినప్పటికీ.. చివరి నిమిషంలో కోహ్లి అభిమానుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో 50 శాతం ప్రేక్షకులకు అనుమతించింది. కోహ్లి కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఈ టెస్ట్‌ విషయంలో ఏ మాత్రం కనికరం చూపని బీసీసీఐ.. ప్రస్తుత టీమిండియా సారధి రోహిత్‌ శర్మ విషయంలో మాత్రం ప్రత్యేక ఆసక్తిని కనబర్చి, కోహ్లి ఫ్యాన్స్‌ నుంచి దారుణమైన ట్రోలింగ్‌ ఎదుర్కొంటుంది. 

బెంగళూరు వేదికగా శ్రీలంకతో రేపటి (మార్చి 12) నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌, రోహిత్‌ కెరీర్‌లో 400వ మ్యాచ్‌ కానుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావించి, ముందుగా అనుకున్న కొన్ని నిబంధనలను సవరించి, బెంగళూరు టెస్ట్‌కు 100 శాతం ప్రేక్షకులకు అనుమతిస్తూ ప్రకటన జారీ చేసింది. 

ఇదే కోహ్లి ఫ్యాన్స్‌ ఆగ్రహానికి కారణమైంది. తమ ఆరాధ్య క్రికెటర్‌ మైలురాయి టెస్ట్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోగా, 50 శాతం ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోని అనుమతించిన బీసీసీఐ.. రోహిత్‌ 400వ మ్యాచ్‌ను హైలైట్‌ (డే అండ్‌ నైట్‌, పింక్‌ బాల్‌ మ్యాచ్‌) చేస్తూ 100 శాతం ప్రేక్షకులను అనుమతించడమేంటని మండిపడుతున్నారు. కోహ్లి విషయంలో కోవిడ్‌ నిబంధనల పేర్లు చెప్పి తప్పించుకున్న బీసీసీఐకి ఇప్పుడు ఆ నిబంధనలు పట్టవా అని ఫైరవుతున్నారు. బీసీసీఐ కంకణం కట్టుకుని మరీ కోహ్లిని అవమానించాలని చూస్తే మాత్రం ఊరుకోమని సోషల్‌మీడియా వేదికగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. 
చదవండి: Ind Vs Sl 2nd Test: రోహిత్‌ శర్మపై దారుణమైన ట్రోల్స్‌.. చమీర‘సన్‌’ అంటూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement