ఇంతకూ కోహ్లి ఔటా? నాటౌటా? | Kohli Out or Not Out? BCCI Asks Fans to Decide | Sakshi
Sakshi News home page

ఇంతకూ కోహ్లి ఔటా? నాటౌటా?

Published Mon, Mar 6 2017 8:27 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

ఇంతకూ కోహ్లి ఔటా? నాటౌటా?

ఇంతకూ కోహ్లి ఔటా? నాటౌటా?

ప్రస్తుతం కొనసాగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి అదృష్టం ఏమాత్రం కలిసిరావడం లేదు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టు మూడోరోజు కూడా కోహ్లి ఔట్‌ కొంత సందేహాస్పదంగానే ఉంది. హజెల్‌వుడ్‌ విసిరిన బంతి కోహ్లి ప్యాడ్‌ను ఢీకొట్టింది. మరో ఆలోచన లేకుండా ఫీల్డ్‌ ఎంపైర్‌ ఎల్‌బీడబ్ల్యూ ఔట్‌ ప్రకటించాడు. దీంతో కోహ్లి ఆవేశంగా డీఆర్‌ఎస్‌ సమీక్షకు వెళ్లాడు.

ఎప్పటిలాగే డీఆర్‌ఎస్‌ కూడా ఈసారి కోహ్లికి దురదృష్టాన్ని మిగిల్చింది. వాస్తవానికి బంతి ప్యాడ్‌కు తాకినప్పటికీ.. డీఆర్‌ఎస్‌ సమీక్షలో రెండో శబ్దం కూడా వినిపించింది. దీంతో మొదట బంతి బ్యాట్‌ను తాకి.. తర్వాత ప్యాడ్‌ను తాకిందేమోనన్న అనుమానం తలెత్తింది. అయితే, బంతి మొదట ప్యాడ్‌ తాకిందా? లేక బ్యాటును తాకిందా? అన్నది థర్డ్‌ ఎంపైర్‌కు సవాలుగా మారింది. వీలున్న అన్ని మార్గాల్లోనూ బంతి గమనాన్ని సమీక్షించిన థర్డ్‌ ఎంపైర్‌ చివరకు కోహ్లి ఔట్‌గానే తేల్చాడు. తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో కోహ్లి మైదానాన్ని వీడాడు. ఇక, బీసీసీఐకి కూడా ఇదే డౌట్‌ వచ్చింది? కోహ్లి ఔటా? నాటౌటా? ఎంఫైర్‌ ఔట్‌ ఇచ్చాడు. మరి మీరేమంటారు' అంటూ క్రికెట్‌ అభిమానులకే చాయిస్‌ ఇస్తూ ట్వీట్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement