pic credit insidesport
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ (మార్చి 4 నుంచి 8 వరకు) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కెరీర్‌లో వందో టెస్ట్ మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. కోహ్లి కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ఈ మ్యాచ్‌ను స్టేడియంలో వీక్షించేందుకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అనుమతించలేదు. కెప్టెన్సీ విషయంలో కోహ్లితో నెలకొన్న వివాదాల కారణంగా బీసీసీఐ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని కోహ్లి అభిమానులు రగిలిపోతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన ఓ వార్త కోహ్లి అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అంగీకరించింది. ఈ విషయాన్ని కేసీఏ కార్యదర్శి సంతోష్ మీనన్ ధృవీకరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని ఆయన ప్రకటించారు. మార్చి 12 నుంచి 16 వరకు జరగనున్న బెంగళూరు టెస్టు.. డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరగనున్న విషయం తెలిసిందే.
చదవండి: విరాట్ కోహ్లి 100వ టెస్ట్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Comments
Please login to add a commentAdd a comment