ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చ లేక సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి సంబంధించి ఓ అరుదైన రికార్డు ప్రమాదంలో పడింది. బెంగళూరు వేదికగా ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌లో (శ్రీలంకతో) విరాట్ మరో 43 పరుగులు చేయకపోతే టెస్ట్‌ల్లో ఆరేళ్ల తర్వాత తొలిసారిగా 50 సగటు మార్కును కోల్పోతాడు.
23rd November 2019: Virat Kohli’s 70th century.
— Prajakta (@18prajakta) November 23, 2021
The last time he scored a ton. It’s been two years and counting… pic.twitter.com/ZwOf4Qiwrp
ప్రస్తుతం కోహ్లి అన్ని ఫార్మాట్లలో 50కిపైగా సగటుతో(కనీసం 90 మ్యాచ్‌ల్లో) కొనసాగుతూ, ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. శ్రీలంకతో జరగబోయే రెండో టెస్ట్‌లో ఇదే రికార్డుకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కును అందుకోలేక ఇబ్బంది పడుతున్న కోహ్లి ఈ రికార్డును కూడా కోల్పోతే మరింత ఒత్తిడిని ఎదుర్కొంటాడని విశ్లేషకులతో పాటు అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం కోహ్లి 100 టెస్ట్‌ల్లో 50.35, 260 వన్డేల్లో 58.07, 97 టీ20ల్లో 51.50 సగటుతో కొనసాగుతున్నాడు. కోహ్లి తన 52వ టెస్ట్‌లో(ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో) తొలిసారిగా సుదీర్ఘ ఫార్మాట్‌లో 50 సగటును అందుకున్నాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 235 పరుగులు చేశాడు. ఇక టెస్ట్ ఫార్మాట్‌లో అతని అత్యుత్తమ సగటు 2019లో పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో కోహ్లి 254పరుగులు చేయడంతో అతని యావరేజ్ 55.10కు చేరింది.
నాటి నుంచి అది తగ్గుతూ వస్తూ ప్రస్తుతం 50 దిగువకు పడిపోయే ప్రమాదంలో పడింది. కోహ్లి చివరిసారిగా 2019లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో సెంచరీ (70వ శతకం) చేశాడు. ఆ టెస్ట్ తర్వాత 28 నెలల కాలంలో కోహ్లి తానాడిన 29 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 28.75 సగటుతో పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో కోహ్లి కేవలం 45 పరుగులు మాత్రమే చేసి అభిమానులను మరోసారి నిరాశపరిచాడు.
చదవండి: మటన్ రోల్స్ తినేందుకు వెళ్లి చిక్కుల్లో పడిన విరాట్ కోహ్లి..!
Comments
Please login to add a commentAdd a comment