బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్‌తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరబోతుంది. మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌తో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 400 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించనున్న 35వ అంతర్జాతీయ క్రికెటర్‌గా, 9వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు.
ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లతో టాప్‌లో ఉండగా, లంక మాజీ ప్లేయర్లు మహేల జయవర్థనే (652), సంగక్కర (594), జయసూర్య (586) వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో ఉన్నారు. భారత్ తరఫున సచిన్ తర్వాత ధోని (538), రాహుల్ ద్రవిడ్ (509), విరాట్ కోహ్లి (457), మహ్మద్ అజహారుద్దీన్ (433), సౌరవ్ గంగూలీ (424), అనిల్ కుంబ్లే (403), యువరాజ్ సింగ్ (402) రోహిత్ (399) కంటే ముందున్నారు.
2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హిట్‌మ్యాన్.. తన 15 ఏళ్ల కెరీర్‌లో 44 టెస్ట్ మ్యాచ్‌లు, 230 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. ఈ క్రమంలో 41 సెంచరీలు, 84 హాఫ్ సెంచరీల సాయంతో 15672 పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగే రోహిత్.. ఈ ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు (125), అత్యధిక పరుగులు (3313) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
చదవండి: Rohit Sharma: కలలో కూడా ఊహించలేదు: రోహిత్ శర్మ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment