అహ్మదాబాద్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్,టీమిండియాల మధ్య సిరీస్ ప్రారంభం అయినప్పటి నుంచి ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. తొలి టెస్టులో ఇంగ్లండ్ మ్యాచ్ గెలవగానే.. టీమిండియా ఇప్పుడే సమాధానం ఇస్తారు చెప్పండి అంటూ ఘాటు విమర్శలు చేశాడు. అయితే టీమిండియా చెన్నైలోనే జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై గెలిచి పీటర్సన్‌కు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చింది. అయితే టీమిండియా ఇంగ్లండ్- బి టీమ్‌తో ఆడి గెలిచిదంటూ పీటర్సన్ ట్రోల్ చేసి విమర్శల పాలయ్యాడు.
తాజగా మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకోగానే పీటర్సన్ హిందీలో ట్వీట్ చేశాడు. 'ఇది టాస్ ఎవరు గెలిస్తే వారు మ్యాచ్ గెలుస్తారని నేను అనుకోను.. కేవలం మ్యాచ్‌లో వికెట్లు తీయడంపైనే విజయం ఆధారపడి ఉంటుంది.' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం పీటర్సన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా బౌలర్ల ఉచ్చులో పడిన ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. అక్షర్ పటేల్ వేసిన 28వ ఓవర్ 5వ బంతికి స్టోక్స్ ఎల్బీగా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 81 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 86 పరుగులుగా ఉంది.
చదవండి: 'ప్లీజ్.. పీటర్సన్‌ను ఎవరు ట్రోల్ చేయొద్దు'
'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్ ఆడను'
Oops india , asha karta hoon ki yeh, toss jeeto match jeeto wala wicket na ho 😉
— Kevin Pietersen🦏 (@KP24) February 24, 2021
Comments
Please login to add a commentAdd a comment