
కోల్‌కతా: ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా ఈ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో మహ్మదుల్లా క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్న రోహిత్ శర్మ శభాష్ అనిపించాడు. అంతకుముందు రహీమ్ క్యాచ్‌ను సెకండ్ స్లిప్‌లో జారవిడచడంతో అసహనానికి గురైన రోహిత్.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో స్లిప్ క్యాచ్‌లను ప్రాక్టీస్ చేసి మరీ దాన్ని అధిగమించాడు. ఫలితంగా మహ్మదుల్లా క్యాచ్‌ను ఎటువంటి తప్పిదం లేకుండా అందుకున్నాడు.
తాజాగా నగరంలోని ఈడెన్ గార్డెన్‌లో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో రోహిత్ మళ్లీ అదరగొట్టాడు. సెకండ్ స్లిప్‌లో మరొక క్యాచ్‌ను డైవ్ కొట్టి మరీ అందుకుని ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 11 ఓవర్ తొలి బంతిని బంగ్లాదేశ్ కెప్టెన్ మోమినుల్ హక్ డిఫెన్స్ ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్ పట్టుకుని స్లిప్‌లోకి వెళ్లింది. ఆ క్రమంలోనే ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి ఆ క్యాచ్‌ను అందుకోవడానికి సిద్ధమయ్యాడు. కాగా, సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అంతకుముందుగానే అలర్ట్ కావడంతో అమాంతంగా డైవ్ కొట్టాడు.(ఇక్కడ చదవండి: నాలుగు వికెట్లు.. మూడు డకౌట్లు)
కోహ్లి బిత్తరపోయేలా ఒక్క ఉదుటన ఎగిరి క్యాచ్‌ను ఒడిసి పట్టుకున్నాడు. దాంతో బంగ్లా కెప్టెన్ ఇన్నింగ్స్ సున్నాకే ముగిసింది. కాకపోతే రోహిత్ ఈ క్యాచ్ పట్టిన తీరు టీమిండియా కెప్టెన్ కోహ్లితో పాటు జట్టులోని ఆటగాళ్లలో జోష్ నింపింది. తొలి రోజు లంచ్ సమయానికి బంగ్లాదేశ్ ఆరు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. షాద్‌మన్ ఇస్లామ్(29) ఫర్వాలేదనించగా, మిగతా ఐదుగురు ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ఇమ్రుల్(4) నిరాశపరచగా, మోమినుల్, మహ్మద్ మిథున్, ముష్పికర్ రహీమ్‌లు డకౌట్లు అయ్యారు. మహ్మదుల్లా సైతం వైఫల్యం చెందాడు. ఈ ఆరు వికెట్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీకి వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment