అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టు రెండో రోజు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం విశేషం. ఆతిథ్య జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కట్టడి చేయడంలో బుమ్రా తన వంతు పాత్ర పోషించి రెండు వికెట్లు తీశాడు. ఓపెనర్లు మాథ్యూ వేడ్, జో బర్న్స్ వికెట్లు తీసి ఆసీస్ వికెట్ల పతనానికి నాంది పలికాడు. దాంతో టీమిండియాకు 53 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లిసేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తాకింది. నాలుగు పరుగులే చేసిన ఓపెనర్ పృథ్వీ షా తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 7 పరుగులే. అయితే, రెండో రోజు ఆట ముగిసేందుకు మరికొంత సమయం మాత్రమే ఉండటంతో మరో కీలక వికెట్ కోల్పోకుండా టీమిండియా జాగ్రత్త పడింది.
నైట్ వాచ్‌మన్‌గా బుమ్రాను బ్యాటింగ్‌కు పంపించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించిన స్టార్క్, కమిన్స్ బౌలింగ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న బుమ్రా పరుగులేమీ చేయకుండా వికెట్ కాపాడుకున్నాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘నెంబర్ 3లో బ్యాంటింగ్‌కు పంపినా తడబడకుండా నిలిచావు. గుడ్ జాబ్ బుమ్రా. వెల్ ప్లేయ్డ్’అంటూ టీమిండియా ఇన్‌స్టా పోస్టులో పేర్కొంది. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న బుమ్రాను కెప్టెన్ కోహ్లి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఇతర ఆటగాళ్లు గౌరవ స్వాగతం (గార్డ్ ఆఫ్ ఆనర్) పలికారు. బాగా ఆడావ్.. అటూ ప్రశంసించారు. ఇదే అడిలైడ్‌లో ఆసీస్‌తో జరిగిన పింక్‌బాల్ ప్రాక్టీస్ టెస్టు మ్యాచ్‌లో బుమ్రా అర్ధ సెంచరీ సాధించడం విశేషం. అతనికిదే తొలి ఫస్ట్ క్లాస్ ఫిఫ్టీ కావడం మరో విశేషం. ఇదిలాఉండగా.. పింక్ బాల్‌తో 8 టెస్టుల అనుభవం ఉన్న ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో అదే తక్కువ స్కోరు.
— A (@_shortarmjab_) December 11, 2020
Comments
Please login to add a commentAdd a comment