అడిలైడ్: 49204084041 ఇది పదకొండు అంకెల బ్యాంకు ఖాతా నెంబర్ కాదు. బ్యాంకుల నుంచి, ఇతర కార్యకలాపాల నిమిత్తం కస్టమర్లకు ఆయా సంస్థలు పంపించే వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) అసలే కాదు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియా ఆటగాళ్ల మొత్తం స్కోరు నెంబర్లు ఇవి. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందేమోగానీ, యావత్ క్రికెట్ అభిమానులను ఈ అంకెలు విస్మయానికి గురిచేస్తున్నాయి. పింక్‌బాల్ టెస్టు మొదటి రోజు ఆస్ట్రేలియా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో సఫలమైన కోహ్లి సేన.. రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసిన భారత జట్టు 36 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థి బౌలర్ల ముందు మోకరిల్లింది.
ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత జట్టుకు 53 పరుగుల ఆదిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్ పరుగులతో కలిసి 89 పరుగుల ఆదిక్యం లభించింది. దీంతో ఆసీస్ విజయ లక్ష్యం 90 పరుగులుగా టీమిండియా నిర్దేశించింది. ప్రస్తుతం వికెట్లేమీ కోల్పోకుండా ఆతిథ్య జట్టు విజయం వైపు దూసుకెళ్తోది. ఓపెనర్లు మాథ్యూ వేడ్ (51 బంతుల్లో 33; 5 ఫోర్లు), జో బర్న్స్ (50 బంతుల్లో 33; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. రెండు పరుగుల ఎక్స్‌ట్రాల రూపం వచ్చాయి. ఆస్ట్రేలియా విజయానికి మరో 23 పరుగుల దూరంలో ఉంది.
The OTP to forget this is 49204084041 .#INDvsAUSTest
— Virender Sehwag (@virendersehwag) December 19, 2020
Comments
Please login to add a commentAdd a comment