న్యూఢిల్లీ: గతంలో పింక్ బాల్ టెస్టుల కోసం సూత్రప్రాయ అంగీకారం తెలిపిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఈ ఏడాది ఆసీస్ పర్యటన సందర్భంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్‌లో డే అండ్ నైట్ టెస్ట్ నిర్వహించాలనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. అంతే కాకుండా అక్టోబర్‌లో రాజ్‌కోట్ వేదికగా భారత్-వెస్టిండీస్ డే అండ్ నైట్ టెస్ట్ ప్రయత్నాన్ని కూడా బీసీసీఐ విరమించుకుంది.
త్వరలో జరగబోయే టెస్టు చాంపియన్‌షిప్‌లో డే అండ్ నైట్ టెస్టును ఐసీసీ చేర్చలేనప్పుడు.. ఆ ఫార్మాట్‌లో ఆడడం వల్ల ప్రయోజనం లేదని బీసీసీఐ భావిస్తోందని బోర్డు వర్గాలు తెలిపాయి. దాంతోనే పింక్ బాల్ టెస్టుపై బీసీసీఐ విముఖత వ్యక్తం చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment